వైసీసీ లీడర్స్ స్థలం మొత్తం కబ్జా చేశారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన లేడీ
ఆంధ్రప్రదేశ్ లొ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు పైన ఫిర్యాదులు చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. వైసీపీ ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలలో వైసీపీ నాయకులు అనేక మందిని బెదిరించి భూములు, పొలాలు, ఇంటి స్థలాలు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై ఇలాంటి ఫిర్యాదులు చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
వైసీపీ సీనియర్ నాయకుడు, కర్నూలు జిల్లాలోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు తన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఓ మహిళ కర్నూలు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. రోడ్డుకు ఐదు అడుగుల స్థలం వదలాలని తనను నమ్మించి చివరికి నా ఇంటి స్థలం మొత్తం కబ్జా చేశారని, మీరే న్యాయం చేయాలని బాధితురాలు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు మనవి చేశారు.

పైసా పైసా కూడా పెట్టుకుని 13 ఏళ్ల క్రితం తన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే కొందరు వైసీపీ నాయకులు తనను చంపేస్తామని బెదిరించి మా ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని బాధితురాలు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాకు ఫిర్యాదు చేశారు. కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ వెనుక సాయి నగర్ లో సావిత్రమ్మ అనే మహిళ నివాసం ఉంటున్న సావిత్రమ్మ కర్నూలు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరుడు బుగ్గన కొడుకు బుగ్గన మధుపైన సావిత్రమ్మ అనే మహిళ ఫిర్యాదు చేశారు. బుగ్గన మధు, వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన వైసీపీ నాయకులపై సావిత్రమ్మ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. 13 ఏళ్ల క్రితం తాను 5.50 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, అందులో 2.75 సెంట్ల భూమిలో ఇంటిని నిర్మించుకున్నానని సావిత్రమ్మ కలెక్టర్ రంజిత్ బాషాకు చెప్పారు. మిగిలిన 2.75 సెంట్లు భూమికి తాను ప్రహరీ నిర్మించుకున్నానని, అయితే ఆ స్థలం పైన కాటసాని అనుచరుడు బుగ్గన మధు కన్ను పడిందని సావిత్రమ్మ కలెక్టర్ ఫిర్యాదు చేశారు.

ఆ ఇంటి స్థలాన్ని కొట్టేయడానికి బుగ్గన మధు అనేక ప్రయత్నాలు చేశారని, అయితే తాను అడ్డుకోవడంతో పంచాయతీ కాటసాని దగ్గరికి వెళ్లిందని సావిత్రమ్మ ఆరోపించారు. తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని తనను పిలిపించి రోడ్డుకు 5 అడుగుల స్థలం వదలాలని మనవి చేశారని సావిత్రమ్మ అంటున్నారు. తాను రోడ్డు కోసం ఐదు అడుగుల భూమిని వదిలితే కటసాని అనుచరులు తన 2.75 సెంట్ల భూమి మొత్తం కబ్జా చేశారని, ఈ విషయంపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే నిన్ను చంపేస్తానని తనను బెదిరించారని సావిత్రమ్మ ఆరోపించారు.
కష్టపడి తాను పైసా పైసా కూడా పెట్టుకొని ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసుకున్న భూమిని తనకు అప్పగించాలని, మీరే నాకు న్యాయం చేయాలని బాధితురాలు సావిత్రమ్మ కలెక్టర్ రంజిత్ భాషాకు ఫిర్యాదు చేశారు. సావిత్రమ్మ ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ రంజిత్ భాషా సంబందిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. మొత్తం మీద వైసీపీ నాయకుడి పేరు చెప్పుకున్న వైసీపీ కార్యకర్తలు అమాయకులను బెదిరించి భూములు కబ్జా చేశారని మరోసారి వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications