Y NOT 175 అంటే ఇదేనా జగనన్న ?, ఎలా ఉండేవాళ్లు ఎలా అయిపోయారు ?
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది అని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంచనా వేసినా ఇంత చిత్తుచిత్తుగా ఓడిపోతుంది అని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఊహించుకోలేకపోయారు. వై నాట్ 175 అని గొప్పులు చెప్పుకున్న వైఎస్ జగన్ తాను పెట్టిన పార్టీ 17కు పడిపోతుందని కలలో కూడా ఊహించి ఉండడు పాపం అంటున్నారు ప్రజలు.
ఓటరుతో పెట్టుకుంటే జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కల్యాణ్ అయినా ఒక్కటే. ఎవరినైనా ఓడించే సత్తా మాకు ఉందని అని ఓటరు దేవుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. వై నాట్ 175, కుప్పంలో కూడా మనం గెలుస్తున్నాము అంటూ ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యే వరకు అంటే మే 11వ తేదీ వరకు జగన్ చెప్పిన మాట ఇదే. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను, మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడిస్తాము అంటూ వైఎస్ జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ నాయకులు పదేపదే చెప్పారు.

అయితే అంబటి రాంబాబు, సినీ నటి రోజా, మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశి ఇలా చెప్పుకుంటే పోతే ప్రతిపక్షాలను నోటికి వచ్చినట్లు మాట్లాడిన వైసీపీ నాయకులు లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చేసినా ప్రజలకు ఓపిక ఉన్నంత వరకే, ఎన్నికల సమయంలో ఓటు అనే ఆయుధంతో మనకు బుద్ది చెబుతారు అని అన్ని పార్టీల నాయకులు గుర్తు పెట్టుకుంటే మంచిది అని ప్రజలు అంటున్నారు.
మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచించకుండా వ్యక్తిగత విమర్శలు, రౌడీయిజంతో రాజకీయ నాయకుల్లా చలామణి కవాలని అనుకుంటే మా తీర్పు ఇలాగే ఉంటుంది అంటూ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించారు. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను పబ్లిక్ గా నీఛంగా మాట్లాడి, నోటిదూలతో రెచ్చిపోయిన ఏ ఒక్క నాయకుడు సైతం ఆంధ్రప్రదేశ్ లో గెలిచే పరిస్థితులు లేవని తెలుగువాళ్లు నిరూపించారు.
రాజకీయం వేరు, వ్యక్తిగత విషయాలు వేరు అని సైలెంట్ గా వాళ్ల పని వాళ్లు చేసుకుని వెళ్లిన వైసీపీ నాయకులు మాత్రమే ఈ రోజు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారని ప్రజలు అంటున్నారు. వై నాట్ 175 అంటే ఇదే కదా జగనన్న అని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, చిన్నచిన్న వ్యాపారులు అందరూ ఒక్కటి అయ్యి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేస్తున్నారు.












Click it and Unblock the Notifications