వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందు పందెం కోడి...కొద్దిసేపట్లో చికెన్ పకోడి...

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి: పందెంకోడి...అసలు చూడటానికే చాలా స్పెషల్ గా కనిపిస్తుంది...పోటీలో రౌద్రంగా తలపడే ఈ కోడి...మాంసంగా మారాక దీని రుచికి మరేది సాటిరాదు...అందుకే పందె కోడి మాంసం అంటే భోజన ప్రియులు లొట్టలు వేస్తారు...ఎంత డబ్బయినా పెడతారు...అందుకే ప్రస్తుతం బరుల దగ్గర పందెం కోడి కాసేపటికే చికెన్ పకోడిగా మారిపోతోంది...

కోళ్లలో పందెం కోడి స్ఫెషలా?...అంటే మామూలు స్పెషల్ కాదు సూపర్ స్పెషల్ అంటారు పందెంరాయుళ్లు...ఎందుకంటే ఏనుగు చచ్చినా వెయ్యే...బతికినా వెయ్యే అనేది అసలు సామెత...కానీ గోదావరి జిల్లాలో మాత్రం తాము అదే సామెతను పందెం కోడికి అన్వయించుకుంటామని చెబుతున్నారు వీటి పెంపకందారులు. కారణం ఏంటో వాళ్లే సెలవిస్తున్నారు...గెలిస్తే వీటి ద్వారా వచ్చే బహుమతి...ఓడిపోతే వీటి మాంసానికి లభించే ధర...అందుకే పందెం కోడి అంటేనే సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు.

పందెం కోడి...చికెన్ పకోడి...

పందెం కోడి...చికెన్ పకోడి...

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీలో కోస్తావ్యాపతంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి... ఇక ఈ సందడి గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువ. అందులోనూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో అయితే కోడిపందాలంటే పిచ్చి. అయితే అందులో కూడా పందేల పిచ్చి కాకుండా కోడి పందెం మాంసం అంటే పడిచచ్చిపోయే నాన్ వెజ్ ప్రియులది మరో పిచ్చి...అందుకే ఈ పిచ్చిని క్యాష్ చేసుకునేందుకు అక్కడి స్థానికులు సిద్దంగా ఉన్నారు. పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేస్తున్నారు. దీంతో, ఈ పందెం కోళ్ల పకోడిని రుచి చూడటానికి మాంసప్రియులు ఎగబడుతున్నారు. ఇలా తయారీదారులకు కాసులు కురిపిస్తున్నారు.

 ఎందుకంత స్పెషల్ అంటే...పెంపకమే...

ఎందుకంత స్పెషల్ అంటే...పెంపకమే...

పందెంకోళ్ల చూడటానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి. కారణమేమిటంటే...వీటి పెంపకాన్ని యజమానులు ఒక తపస్సులా చేపడతారు. వీటిని అసలు మిగిలిన కోళ్లతో కలవనీయరు. పెంపకంలో మిగిలిన కోళ్లకు దీనికి ఆహారంతో సహా అన్నీ సపరేటే. అందుకే సాధారణ కోడిపుంజులకన్నా పందెం కోడి పుంజులు చాలా ఎత్తుగా, దృఢంగా ఉంటాయి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముక్కు దృఢంగా, పొడవుగా, కాలివేళ్లు నిటారుగా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని పుంజుల దగ్గరకు వెళ్లడానికి మనుషులు కూడా జంకుతారు.

వీటి ఆహారం...పెంపకం తీరు..అబ్బో అనిపిస్తుంది...

వీటి ఆహారం...పెంపకం తీరు..అబ్బో అనిపిస్తుంది...

పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది...సోళ్లు, సజ్జలు, బాదం, పిస్తా, ఆక్రూట్, మటన్ కైమా, పచ్చసొన తీసివేసిన కోడిగుడ్లు, రెవిటాల్ టాబ్లేట్లు, 18 రకాల దినుసుల లేహ్యం వీటికి సాధారణంగా అందరు పెంపకందారులు తినిపిస్తారు. శుభ్రమైన నీటిని మట్టిపాత్రలోనే అందిస్తారు. ఇక ఈ ఆహారం ఇవ్వడంలోను కొందరు పెంపకందారులు మరింత స్పెషాలిటీ చూపిస్తారు. పందెం కోడి చేతనే కోడి మాంసం కూడా తినిపిస్తారు. లిక్కర్ తాగిస్తారు...ఇలా పెంపకంలో కూడా తమ టాలెంట్, క్రియేటివిటీ చూపిస్తారు.

 శిక్షణ,తర్ఫీదు మరియు మసాజ్ లు వగైరా...

శిక్షణ,తర్ఫీదు మరియు మసాజ్ లు వగైరా...

ఇక ఈ పందెం కోడిని ఒకేచోట ఎక్కువ సేపు నిలబడనివ్వరు. అలా చేస్తే వాటి కాళ్లల్లో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటూ ఇటూ తిప్పుతారు. ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపులను కలిపి మరగపెట్టి బాలింతకు నీళ్లు పోసినట్లు తడిసిన గుడ్డ కొడి చుట్టూ తిప్పి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. చురుగ్గా పరిగెత్తడం సాధన చేయిస్తారు. అలాగే మరో పందెం కోడితో జరిగే పోరులో విజేతగా నిలిచేలా అన్ని రకాల తర్ఫీదునిస్తారు.

 పందెం కోళ్లకు...పహిల్వాన్ లతో శిక్షణా...

పందెం కోళ్లకు...పహిల్వాన్ లతో శిక్షణా...

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం...కొన్ని పందెం కోళ్లకు హైదరాబాద్‌లోని పాతబస్తీ పహిల్వాన్లకి కూడా సంబంధం ఉంది. అదెలాగంటే...తమ కోడి పందెంలో గెలవాలని పట్టుదలతో ఉందే బడాబాబులు వీటికి కండలు తిరిగిన దేహంతో ఉంటే పాత బస్తీ పహిల్వాన్లతో తర్ఫీదు ఇప్పిస్తారు. కొందరైతే వాళ్ల దగ్గరే పెంచేలా చూడటమో వాళ్లు అతి తక్కువ సంఖ్యలో పెంచే పందెం కోళ్లని భాగా ఖరీదు పెట్టి కొనడమో చేస్తారు. మరి కోట్లాది రూపాయలు చేతులు మారే ఈ పోటీల్లో పందెంరాయుళ్ల పంట పండించే పందెం కోళ్ల విషయంలో ఆమాత్రం జాగ్రత్త తీసుకోవడంలో ఆశ్చర్యం ఏముంది.

 ఖరీదు...కాస్త కాదు...చాలా ఎక్కువే...

ఖరీదు...కాస్త కాదు...చాలా ఎక్కువే...

కోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే వారిని ఇక్కడకు రప్పిస్తుంది. బార్కాస్‌లో ఒక్కో కోడిపుంజు ధర లక్ష రూపాయల పైనే పలుకుతుండటం గమనార్హం. అలాగని పహిల్వానులు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో కోడి పుంజులను విక్రయిస్తుంటారు. కోస్తాలో కూడా పందెం కోళ్లకు ప్రత్యేక ధర పలుకుతుంది. వీటి పెంపకాన్ని బట్టి మినిమం 3 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వీటి ధర పలుకుతుంది.

 ఇప్పుడైతే...ఆన్ లైన్ లోకూడా...

ఇప్పుడైతే...ఆన్ లైన్ లోకూడా...

సంక్రాతి సీజన్ లో పందెం కోళ్ల క్రేజ్ ఆకాశానంటుతుండటంతో కాదేదీ కవితకనర్హం అన్న టైప్ లో కాదేదీ ఆన్‌లైన్‌ అమ్మకాలకు అనర్హం అంటున్నారు మరికొందరు తెలివైన అమ్మకందారులు. ఆన్ లైన్ అమ్మకాల గురించి అందరికీ అవగాహన పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలోకి పందెం కోళ్లను కూడా చేర్చేశారు. సెకండ్‌హ్యాండ్‌ వస్తువులను విక్రయించే ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ సైట్లలో ప్రస్తుతం పందెం కోళ్ల అమ్మకం జోరుగా సాగుతోంది. తాము పెంచినవో వేరే వారి దగ్గర కొనుగోలు చేసినవో...ఆ కోడి పుంజులను నీట్‌గా ఫొటోలు తీసి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టేశారు. పందేలకు వినియోగించే కాకి, డేగ, నెమలి ఇలా వాటి రకాన్ని బట్టి వీటి ధర పలుకుతుంది. కనిష్ఠంగా 3000 రూపాయల నుంచి గరిష్ఠంగా 50,000 రూపాయల వరకు వివిధ రకాల కోడి పుంజులు ఔల్‌ఎక్స్‌ వెబ్‌సైట్లో దర్శనమిస్తున్నాయి.

 ఇలా పందెం కోడి...చికెన్ పకోడి గా మారి...

ఇలా పందెం కోడి...చికెన్ పకోడి గా మారి...

ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ పందెం కోడి పోటీలో తలపడి ఒడితే( కొన్ని సందార్భాల్లో గెలిచినా కూడా) ఆ తరువాత అక్కడికక్కడే చికెన్ పకోడీగా మారిపోతోంది. దీంతో ఈ పందెం కోళ్లను తినడానికి ఇటు పందెంరాయుళ్లు అటు మాంసంప్రియులు ఎగబడుతుండటంతో ఈ పందెం కోళ్ల చికెన్ పకోడి వ్యాపారం జోరుగా సాగిపోతోంది. ప్రతిసారి పందెం కోడినే తినలేరు కాబట్టి( ఖరీదు దృష్ట్యా కూడా) భోజన ప్రియుల జిహ్వాచాపల్యాన్ని చల్లార్చేందుకు మరోవైపు మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్...ఇలా ఆల్ వెరైటీ నాన్ వెజ్ వంటకాలను తయారుచేసి అమ్ముతున్నారు. పందెంరాయులు ఎంజాయ్ చేస్తూ జోరుగా పందేలు కాస్తుంటే భోజనప్రియులు లొట్టలేసుకుంటూ ఐటెమ్స్ లాగిస్తున్నారు. మరోపక్క బెట్టింగ్ తో కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి...

English summary
On the final day of the three-day Sankranti festival, huge number of cockfights were going across coastal Andhra. After the big fight the cocks will become chicken pakora.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X