దేవుడు మనోడే, ఏం పర్వాలేదు దోచేయ్, చంద్రబాబు సొంత జిల్లాలో స్వాహా

దేవుడికి ఎదురు తిరిగినా, దేవుడితో పెట్టుకున్న తగిన ఫలితం అనుభవిస్తారని పెద్దలు పదేపదే చెప్తున్నారు. అయితే దేవుడితో గేమ్స్ ఆడటంతో పాటు దేవుడి ఆస్తులు కూడా కొట్టేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. దేవుడి తో పాటు దేవుడు భూములకు కూడా రక్షణ లేదని ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది రాజకీయ నాయకులు అక్షరాల నిరూపించారు. దేవుడు అంటే కూడా మన నాయకులకు భయం లేదని వెలుగు చూసింది.

దేవుడు భూములు కొట్టేయడమే కాకుండా ఆ భూములను ఇతర వ్యక్తులకు లీజుకు అప్పగించి లక్షల రూపాయలు సంపాదించారు. వందల కోట్ల రూపాయలు విలువైన దేవుడి భూములను కొట్టేసింది మరెవరోకాదు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డాలోనే భారీ మొత్తంలో దేవుడు భూములు కొట్టేశారని వెలుగు చూడటంతో ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

The YSRCP leaders who grabbed God s lands in Punganur constituency

పుంగనూరు నియోజకవర్గంలో దేవుడు భూములు కబ్జా కావడంతో పూర్తి పూర్తి సమాచారం సేకరించిన టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దేవుడికే శఠగోపం పెట్టిన పుంగనూరు వైసీపీ నాయకులు జాతకాలు మొత్తం సేకరించిన టీడీపీ నాయకులు కబ్జా ఆయన భూముల వివరాలను కూటమి ప్రభుత్వానికి పంపించడంతో ఆ నియోజక వర్గంలోని వైసీపీ నాయకులకు దడ మొదలైంది. పుంగనూరు, పలమనేరు నియోజక వర్గం పరిధిలో భారీ మొత్తంలో దేవుడి భూములను కబ్జా చేశారని వెలుగు చేసింది.

పుంగనూరు పట్టణంలోని భోగనంజుండేశ్వర స్వామి ఆలయ భూములను అదే ప్రాంతంలోని వైసీపీ నాయకులు గత ఏడాది కబ్జా చేశారు. కబ్జా చేసిన దేవుడు భూముల్లో కట్టడాలు నిర్మించడానికి అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల క్రితమే పుంగనూరు మున్సిపాలిటీ నుండి అనుమతి కూడా తెచ్చుకున్నారు. దేవుడు భూముల్లో భవనాలు నిర్మించడానికి ప్రయత్నించారు. దేవుడు భూములకు కొత్త సర్వే నెంబర్లు వేసి గోల్ మాల్ కు తెరలేపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు నెల రోజుల క్రితం సైలెంట్ అయ్యారు.

The YSRCP leaders who grabbed God s lands in Punganur constituency

సమాచారం తెలుసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో వైసీపీ నాయకులకు కబ్జా చేసిన దేవుడు భూములను అధికారులు వెనక్కి తీసుకుని వాటికి కంచెవేశారు. పుంగనూరు నియోజక వర్గంలోని చౌడేపల్లి సమీపంలోని కాశీ విశ్వనాథ స్వామి భూములు కూడా కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారు. చౌడేపల్లి మండలంలో దేవాలయాలకు చెందిన కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో 1,300కుపైగా దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు 8 వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేవాలయ భూములపై ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు కన్నుపడింది. అంతే వైసీపీ నాయకులు కన్ను పడిన దేవాలయాల భూములు కబ్జా చేశారు. కబ్జా చేసిన భూములు ఇతరులకు లీజ్ కు ఇచ్చిన వైసీపీ నాయకులు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించారని సమాచారం.

అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వైసీపీ నాయకులు కబ్జా చేసిన దేవాలయ భూములు లిస్ట్ మొత్తం రెడీ చేసిన టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పుంగనూరు, పలమనేరు, చౌడేపల్లి, పులిచెర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో దేవాలయ భూములు కబ్జా చేసిన నాయకుల పేర్లు మొత్తం రెడీ చేసిన కూటమి ప్రభుత్వం కబ్జా అయిన భూములను వెనక్కి తీసుకొవడానికి సిద్ధమైందని తెలుస్తుంది.

The YSRCP leaders who grabbed God s lands in Punganur constituency

ముఖ్యంగా పుంగనూరు పట్టణంలో వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూముల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని, ఓ మాజీ మంత్రి అండతో స్థానిక వైసీపీ నాయకులు వాటిని కబ్జా చేశారని, చివరికి ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మారిపోవడంతో ఆ వైసీపీ నాయకులు షాక్ అయ్యారని తెలిసింది. మొత్తం మీద దేవుడి ఆస్తులకే శఠగోపం పెట్టిన నాయకుల జాతకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+