ముఖాలకు కర్చీఫ్: ఇంట్లోకి చొరబడి చోరీ (ఫొటోలు)

హైదరాబాద్‌: ఇంట్లో అందరూ ఉండగానే ముఖాలకు కర్చీఫ్‌ కట్టుకుని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు వంట చేస్తున్న మహిళను కత్తితో బెదిరించి మూడు తులాల మంగళసూత్రం, ఐదు వేల రూపాయల నగదు తీసుకుని పారిపోయారు. అడ్డుకోబోయిన ఇంటి యజమానిని గాయపరిచారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిస్మత్‌పూర్‌ నుంచి రాక్‌ చర్చి వైపు వెళ్లే దారిలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ కాలనీలో మంగళవారం జరిగింది.

ఎన్‌ఆర్‌ఐ కాలనీలో రెండు, మూడు ఇళ్లుమాత్రమే ఉంటాయి. ఓ ఇంట్లో పూనకుమార్‌ సింగ్‌, సరస్వతి సింగ్‌తోపాటు ఇద్దరు పిల్లలు నివసిస్తుంటారు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు సరస్వతి వంట చేస్తోంది. పూనకుమార్‌సింగ్‌ బెడ్రూమ్‌లో కంప్యూటర్‌ వద్ద ఉన్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు మొహాలకు కర్చీఫ్‌లు కట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఓ వ్యక్తి హాల్‌లో ఉండగా ఇంకొకరు వంట గదిలోకి వెళ్లి సరస్వతిసింగ్‌కు కత్తి చూపి బెదిరించారు. ఆమె మెడలోని రెండు తులాల బంగారు మంగళసూత్రం, చేతికి ఉన్న ఉంగరం తీసుకున్నారు.

అరిస్తే చంపేస్తామని డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో ఆమె రూ.ఐదు వేల నగదు వారికి ఇచ్చేసింది. ఇది గమనించి పూనకుమార్‌సింగ్‌ అక్కడకు రాగా ఆయన్ను కత్తులతో బెదిరించి మూడు సెల్‌ఫోన్లను తీసుకుని పారిపోసాగారు. దీంతో పూనకుమార్‌సింగ్‌ వంట గదిలోకెళ్లి కత్తి తీసుకుని దుండగులపై దాడిచేశాడు. వారు కూడా ప్రతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పూనకుమార్‌సింగ్‌ కుడిచేయి మణికట్టుపై, వీపుపై స్వల్ప గాయాలయ్యాయి. వారు ప్రహారీ దూకి పారిపోయారు.

బయట వీరి కోసం ద్విచక్ర వాహనంపై వేచి ఉన్న మరో వ్యక్తితో కలిసి పారిపోయారు. దీనిపై పూనకుమార్‌సింగ్‌ రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌, డీఎస్‌ఐ లక్ష్మణ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లను రప్పించి దర్యాప్తు చేపట్టారు. కిస్మత్‌పూర్‌కు చెందిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కత్తులతో బెదిరించి చోరీ

కత్తులతో బెదిరించి చోరీ

అందరూ ఉండగానే ఇంట్లోకి ప్రవేశించి, ఇద్దరు యువకులు దంపతులను బెదిరించి, నగలను దోచుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గాయపడిన ఇంటి యజమాని

గాయపడిన ఇంటి యజమాని

వంట చేస్తున్న మహిళను కత్తితో బెదిరించి మూడు తులాల మంగళసూత్రం, ఐదు వేల రూపాయల నగదు తీసుకుని దొంగలు పారిపోయారు. అడ్డుకోబోయిన ఇంటి యజమానిని గాయపరిచారు.

కత్తి చూపి బెదిరించారు...

కత్తి చూపి బెదిరించారు...

ఇద్దరు యువకులు ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఓ వ్యక్తి హాల్‌లో ఉండగా ఇంకొకరు వంట గదిలోకి వెళ్లి సరస్వతిసింగ్‌కు కత్తి చూపి బెదిరించారు. ఆమె మెడలోని రెండు తులాల బంగారు మంగళసూత్రం, చేతికి ఉన్న ఉంగరం తీసుకున్నారు.

ఎదురుదాడిలో గాయాలు..

ఎదురుదాడిలో గాయాలు..

పూనకుమార్‌సింగ్‌ వంట గదిలోకెళ్లి కత్తి తీసుకుని దుండగులపై దాడిచేశాడు. వారు కూడా ప్రతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పూనకుమార్‌సింగ్‌ కుడిచేయి మణికట్టుపై, వీపుపై స్వల్ప గాయాలయ్యాయి. వారు ప్రహారీ దూకి పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+