Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కమాండర్ ఇంటికే కన్నమేసి 30 లక్షల బంగారం చోరీ ... చోరీ చేసింది ఎవరో తెలిసి కమాండర్ షాక్

నాగార్జున యూనివర్సిటీ లోని పదవ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కు కమాండర్ గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ ఇంట్లో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. సంతోష్ కుటుంబానికి చెందిన 30 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అయితే ఈ కేసును మంగళగిరి పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. అసలు కమాండర్ సంతోష్ కుమార్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే మాత్రం అందరూ కచ్చితంగా షాక్ అవుతారు.

కమాండర్ ను నమ్మించిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్

కమాండర్ ను నమ్మించిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్

ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కునుకు శ్రీనివాస రావు ఎన్డీఆర్ఎఫ్ లోని కమాండెంట్ కార్యాలయం వద్ద డిప్యుటేషన్ మీద పని చేస్తున్నాడు. ఏడేళ్లుగా కుటుంబ సభ్యుడిగా మెలిగిన శ్రీనివాసరావును కమాండర్ సంతోష్ కుమార్ ఎంతగానో నమ్మాడు. ఇంటి మనిషి లాగా మెలగడంతో తన ఇంటి తాళం చెవుల్లో ఒకటి అతనికి ఇచ్చారు. ఇక ఇటీవల జమ్మూకాశ్మీర్ కు కమాండెంట్, శ్రీకాకుళం జిల్లాకు కానిస్టేబుల్ బదిలీ అయ్యారు.

 బదిలీ అయినా వెళ్ళకుండా కమాండర్ ఇంట్లో ఉన్న శ్రీనివాసరావు

బదిలీ అయినా వెళ్ళకుండా కమాండర్ ఇంట్లో ఉన్న శ్రీనివాసరావు


అయితే సంతోష్ కుమార్ జమ్మూ కాశ్మీర్ కు వెళ్లే వరకు ఆయనతోనే ఉంటానని, ఆ తర్వాత శ్రీకాకుళం వెళతానని కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఆయనకు విజ్ఞప్తి చేశాడు. కాస్త సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నట్లు గా కూడా బిల్డప్ ఇచ్చాడు.

అది నమ్మిన సంతోష్ కుమార్ తమతో పాటే కానిస్టేబుల్ శ్రీనివాస రావును అక్కడే ఉండేందుకు అంగీకరించారు. 2 రోజుల క్రితం సంతోష్ కుమార్ తన ఇంటిని ఖాళీ చేసి జమ్ము కాశ్మీర్ కు ఇంటి సామాను పంపించారు.

 కమాండర్ ఇంట్లో 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల చోరీ

కమాండర్ ఇంట్లో 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల చోరీ

ఇక బంగారు ఆభరణాలు, కీలకమైన వాటిని మాత్రమే ఇంట్లో ఉంచుకున్న సంతోష్ కుమార్ 11వ తేదీ నా కుటుంబ సభ్యులతో కలిసి తనతో కలిసి పని చేసే అధికారి కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారు. ఇదే అదునుగా చూసిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలకు హాజరైన హాజరై మధ్యలో అక్కడి నుంచి మాయమై కమాండెంట్ ఇంట్లో ఉన్న 30 లక్షల విలువ చేసే బంగారాన్ని దొంగిలించారు. దొంగలు ఈ పని చేసినట్లుగా సీన్ క్రియేట్ చేశారు.

 దొంగలే దొంగతనం చేసినట్టు సీన్ క్రియేట్ చేసిన కానిస్టేబుల్

దొంగలే దొంగతనం చేసినట్టు సీన్ క్రియేట్ చేసిన కానిస్టేబుల్


ఇంటికి వచ్చి చూసిన కమాండెంట్ తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా ఎస్పీ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల్లోనే ఈ వ్యవహారాన్ని తేల్చేశారు. ఇంటి తాళం చెవులు ఒక సెట్ శ్రీనివాస రావు దగ్గర ఉన్నాయని చెప్పడంతో అతన్ని విచారించిన అధికారులను బుకాయించాడు . తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఆ బంగారం గురించి తెలియదని పేర్కొన్న శ్రీనివాసరావు , చోరీకి పాల్పడిన వారు దొంగలే అన్నట్లుగా వాదించాడు.

రెండు గంటల్లో కేసును చేదించిన పోలీసులు .. దొంగ ఎవరో తెలిసి అందరూ షాక్

రెండు గంటల్లో కేసును చేదించిన పోలీసులు .. దొంగ ఎవరో తెలిసి అందరూ షాక్


అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా విచారించడంతో అసలు విషయాన్ని బయట పెట్టాడు శ్రీనివాసరావు. చోరీ చేసింది తానేనని, తనకున్న 10 లక్షల రూపాయలు అప్పు తీర్చడం తోపాటు గా భార్యాపిల్లలకు బంగారు ఆభరణాలు చేయించాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లుగా అంగీకరించారు . అతని వద్దనుండి 30 లక్షల రూపాయల నగలను స్వాధీనం చేసుకుని కమాండెంట్ కుటుంబానికి అందించారు. కుటుంబంలో ఒక వ్యక్తి లా నమ్మించి చోరీకి పాల్పడిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వ్యవహారం తెలుసుకున్న కమాండెంట్, ఆయన కుటుంబం అవాక్కయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+