హెడ్మాస్టర్‌ని చెప్పుతో కొట్టిన టీచర్, గర్ల్స్ హాస్టల్లో వ్యక్తి
హైదరాబాద్: అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఓ నగల షాపులు నగలు కొనేందుకని వచ్చిన ముగ్గురు వ్యక్తులు నగలు కాజేశారు. నగలు కాజేస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది దొంగలకు దేహశుద్ధి చేసి ఉరవకొండ పోలీసులకు పట్టిచ్చారు. నిందితులు అంతర్రాష్ట్ర దొంగలని పోలీసులు గుర్తించారు.
కేఆర్ నగల దుకాణంలో నగలు కొనేందుకంటూ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మోడల్స్ ఎక్కువగా చూపించమని అడిగారు. దుకాణం సిబ్బంది నగలు చూపించే ప్రయత్నంలో ఉండగా.. దుండగులు చేతివాటం ప్రదర్శించారు. నగలు కాజేస్తున్న దృశ్యాలను సీసీ కెమెరాలో గమనించిన సిబ్బంది దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

విద్యార్థిని కొట్టిన టీచర్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాంచిలి ప్రభుత్వ పాఠశాలలో హోంవర్క్ పుస్తకాన్ని తీసుకురాలేదని ఆగ్రహించిన టీచర్ ఓ విద్యార్థిని కొట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు వచ్చి ఉపాధ్యాయురాలిపై మండిపడ్డారు. ప్రధానోపాధ్యాయుడు సైతం విద్యార్థి వైపు మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు హెచ్‌ఎంపై చెప్పు విసిరారు. దీనిపై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. సదరు ప్రధానోపాధ్యాయుడు తాను ఇక ఈ పాఠశాలలో పని చేయలేనని లాంగ్ లీవ్ పెట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై ఎంఈవో విచారణ జరిపిస్తున్నారు.
లేడీస్ హాస్టల్లో యువకుడి హల్ చల్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలకేంద్రంలోని ఎస్టీ బాలికల వసతిగృహంలోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించిన ఓ ఆగంతకుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలికలు అరవటంతో గ్రామస్థులు వచ్చి ఆగంతకుడైన యువకుడిని పట్టుకొని చితకబాది, పోలీసులకు పట్టించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications