ఆంధ్రాలో చిత్రవిచిత్రమైన లిక్కర్ బ్రాండ్లు, ఫైలు సీబీఐ, ఈడీకి ఇవ్వాలని ఎన్డీఏ ప్లాన్?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయించిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు మద్యం దుకాణాలు వైసీపీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. గతంలో దేశంలోని ప్రముఖ బ్రాండ్ల మద్యం ఆంధ్రప్రదేశ్ లో విక్రయించారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత చిత్రవిచిత్రమైన పేర్లతో ఆంధ్రప్రదేశ్ లో బ్రాందీ, విస్కీ, బీర్లు, జిన్, రమ్ విక్రమించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కథ మారుతోంది. ప్రభుత్వం ఆదీనంలో ఉన్న మద్యం దుకాణాలకు మంగళంపాడేసి ప్రైవేటు వ్యక్తులకు మద్యం విక్రయాల లైసెన్స్ లు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో చర్చలు జరుపుతోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అసలు కథ మొదలుపెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా చేసిన కంపెనీలు ఎన్ని, ఆ కంపెనీల యజమానులు ఎవరు, ఆ కంపెనీలకు మద్యం సరఫరా చెయ్యాలని మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఆ మద్యం కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ మద్యం కంపెనీ ఎప్పుడు పెట్టారు, ప్రస్తుతం ఆ కంపెనీల కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందని తెలిసింది. వైసీపీ ప్రభుత్వ హయామంలో ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి ఆయన అల్లుడు కలిసి కోన్ని బినామీల వ్యక్తుల పేర్లతో కొన్ని బోగస్ లిక్కర్ కంపెనీలు పెట్టించారని, ఆ కంపెనీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయిం,చారని ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని తెలిసింది.
అలాగే రాయలసీమకు చెందిన ఓ ఎంపీ నంద్యాల, కృష్ణా జిల్లాలోని డిస్టలరీలను లీజుకు తీసుకుని కొత్తకొత్త బ్రాండ్ల మద్యం తయారు చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరఫరా చేశారని, అదే మద్యం ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు అప్పటి వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం స్కామ్ లో అరెస్టు అయిన ఓ వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా కంపెనీల్లో చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు అధికారులు ఆరోపిస్తున్నారని తెలిసింది. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఇవ్వడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోందని వెలుగు చూడటంతో ఇంతకాలం అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన ఎక్సైజ్ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులకు దడ మొదలైయ్యిందని సమాచారం.












Click it and Unblock the Notifications