Chiranjeevi: బీజేపీ భారీ స్కెచ్.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్..!
ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ చాలా ప్రాముఖ్యత ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ను వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం చిరంజీవిని ముందు పెట్టి రాజకీయాలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ.. సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. అందుకే చిరంజీవిని పెద్దల సభకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చిరంజీవితో ఇప్పటికే మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఒక వేళ చిరంజీవిని రాజ్యసభకు పంపాలంటే.. ఎక్కడి నుంచి పంపిస్తారానేది కూడా చర్చ కొనసాగుతోంది.

బీజేపీకి యూపీ నుంచి దాదాపు 10 రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది. త్వరలో నోటీఫికేషన్ కూడా రానుంది. ఈ రాజ్య సభ ఎన్నికల్లోనే చిరంజీవిని యూపీ నుంచి పెద్దల సభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీ నుంచి ఇప్పటికే తెలంగాణకు చెందిన లక్ష్మణ్ రాజ్యసభకు ఎంపికయ్యారు.
మెగాస్టార్ చిరంజీవికి గతంలో రాజ్యసభ సభ్యుడిగా.. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఆయన యూపీఏ 2లో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. చిరు 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి రాజకీయాల్లోకి అడుగు పెడతారా లేదా అనేది ప్రశ్నగా మారింది.












Click it and Unblock the Notifications