150వ సినిమా: రాజకీయాలు పక్కన పెడుతున్న చిరంజీవి!
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాలో రాజకీయాలను స్పృశిస్తారా? అంటే కాదనే అంటున్నారు. చిరంజీవి నూటా యాభయ్యవ సినిమా గురించి రెండు మూడేళ్లుగా చర్చ సాగుతోంది.
ఆయన తన చిత్రంలో రాజకీయాలను టచ్ చేస్తారనే వాదనలు వినిపించాయి. అంతేకాదు, చిరంజీవి 150వ చిత్రాన్ని 2019 ఎన్నికలకు కొద్దిగా ముందు విడుదల చేసి, కాంగ్రెస్ పార్టీ చిరంజీవి రాజకీయ ఇమేజ్ తమకు ఉపయోగపడేలా చేసుకుంటుందనే వాదనలు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆయన 150వ చిత్రంలో రాజకీయాలను టచ్ చేస్తారనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా ప్రారంభమైంది. అయితే, ఈ చిత్రం విషయంలో చిరంజీవి పక్కాగా ఉన్నాడని తెలుస్తోంది.
తన సినిమాలో రాజకీయ డైలాగులు, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలు ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దర్శకులు వినాయక్‌కు కూడా అదే విషయం చెప్పారని, ఆ విధంగానే ఆయన స్క్రిప్ట్ రూపొందించారనే వాదనలు వినిపిస్తున్నాయి. చిరంజీవి 150 సినిమాలో పొలిటికల్ టచ్‌కు అవకాశం లేదని తాజాగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications