తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్, పెద్దారెడ్డి ఎంట్రీతో సీన్ రిపీట్, హడలిపోతున్న ప్రజలు

రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకి పెట్టింది పేరుగా తాడిపత్రి చరిత్ర కెక్కింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాడిపత్రిలో శాంతిభద్రతలు విషయంలో ప్రజల భయపడిపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదలైన గొడవలు తాడిపత్రిలో ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నాయకులు, రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఇప్పుడు కూడా గొడవలు జరుగుతుండడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో అడుగుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షరతులతో బెయిల్ తీసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కావాలనే తాడిపత్రి పట్టణంలో అడుగుపెట్టి వైసీపీ నాయకుడు కందిగోవుల మురళి ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

There was a tense situation in Tadipatri due to the clash between YCP and TDP leaders

ఈ సందర్భంగా టీడీపీ, వైసిపి కార్యకర్తలు మధ్య గొడవ జరగడంతో స్థానిక ప్రజలు భయపడి తాడిపత్రి వదిలి వెళ్లిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవల కారణంగా టీడీపీ, వైసీపీ నాయకులు తాడిపత్రి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఊరు వదిలి వెళ్లిపోయిన అ నాయకులు ఇంతవరకు తాడిపత్రి పట్టణంలో అడుగుపెట్టలేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు టీడీపీ నాయకులు తాడిపత్రికి వచ్చినా ఇంత వరకు వైసీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం తాడిపత్రి పట్టణంలో అడుగుపెట్టలేదు. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం తాడిపత్రిలో అడుగు పెట్టారు. షరతులతో బెయిల్ తీసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టకుండా అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు అనేక ప్రయత్నాలు చేశారు.

There was a tense situation in Tadipatri due to the clash between YCP and TDP leaders

అయితే పోలీసులు అడ్డుపడుతున్నా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోకి వెళ్లి కందిగోవుల మురళి ఇంటికి వెళ్లడంతో టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు మీద టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో టీడీపీ, వైసీపీకి చెందిన నాయకుల మీద పోలీసులు పరస్పరం కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడిపత్రిలో పోలీసులు అధికారులు అందరూ బదిలీ అయ్యారు. అయితే ఇంతవరకు తాడిపత్రికి ఎస్సైలు రాకపోవడంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+