సరిగ్గా 24 గంటల్లో ఈ రాశులవారి జాతకం మారిపోనుంది!
గ్రహాల రాజైన సూర్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. సూర్యుడి రాశి మార్పును సంక్రాంతి అంటారు. ఈనెల 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీన్ని ధను సంక్రాంతి అంటారు. ఇప్పటికే అక్కడ గ్రహాల రాకుమారుడైన బుధుడు సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. మేషరాశిలో రాజలక్షణ రాజయోగంతో పాటు రుచక రాజయోగం కూడా ఏర్పడనుంది. బుధాదిత్య యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
సింహరాశి
కెరీర్ లో మంచి స్థానానికి చేరుకుంటారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కల నెరవేరుతుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

మేషరాశి
పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 2024లో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధికా ప్రాధాన్యతనిస్తారు.
తులారాశి
వీరు ఏ రంగంలో అడుగుపెట్టిన విజయం సాధిస్తారు. కెరీర్ లో మంచి పురోగతి ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. భారీ మొత్తంలో డబ్బు సంపాదన ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు మంచి ప్యాకేజీతో మరో ఉద్యోగాన్ని సాధిస్తారు.












Click it and Unblock the Notifications