విశాఖ అందాలు: ది సిటీ ఆఫ్ డెస్టినీ అద్భుతం చూడండి! (వీడియో)
విశాఖ: భారత దేశంలోని తీర ప్రాంత నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఒకటి. ఆర్థిక పరంగానే కాకుండా దేశంలో అందమైన నగరాల్లోను ఒకటి విశాఖ. విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యుత్తమ తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు నవ్యాంధ్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవలే భాగస్వామ్య సదస్సును విశాఖలో నిర్వహించింది. దాదాపు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. వచ్చేసారి కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
విశాఖ అందమైన నగరం. దీనిని మరింత సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను మరింత ఎక్కువ ఆకర్షించాలని చూస్తున్నారు. ఇలాంటి అందమైన విశాఖ నగరంపై 'విశాఖ - ది సిటీ ఆఫ్ డెస్టీని' అంటూ అల్ట్రా హెచ్‌డి వ్యూలో అద్భుతం చేశారు. ఇది కనువిందు చేస్తోంది.












Click it and Unblock the Notifications