2015లో చూడాల్సిన ప్రదేశాలు: 2వ స్థానంలో హైదరాబాద్

న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరం మరో ఘనతను సాధించింది. 2015లో ప్రపంచంలో చూడాల్సిన ప్రదేశాల జాబితాలో హైదరాబాద్ నగరానికి ద్వితీయ స్థానం లభించింది. ఈ జాబితాను ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ పబ్లికేషన్ మేగజైన్ వెల్లడించింది. కాగా, అమెరికాలోని ది ప్రెసిడియో ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

‘2015లో ప్రపంచంలో చూడాల్సిన 20 ఉత్తమ ప్రదేశాలు' పేరుతో నేషనల్ జియాగ్రాఫిక్ ‘ట్రావెలర్' వార్షిక గైడ్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో హైదరాబాద్ ద్వితీయ స్థానాన్ని సాధించింది. భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నగరం కావడం విశేషం.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను పాలించిన చివరి నిజామని మేగజైన్ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నో అంతర్జాతీయ ఐటి కంపెనీలకు నిలయమని, తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, ఇరానీ కేఫ్‌లు, ఐదో తరం ముత్యాల వ్యాపారం, మొదలగు అనేక ప్రత్యేకతలను కలిగి ఉందని తెలిపింది.

This Indian City is Ranked 2 on a Global List of Places to See in 2015

ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ అత్యద్భుతమైన ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలకు, రాజ భవనాలకు నెలవని మేగజైన్ పేర్కొంది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్‌లోని జెర్మట్, వాషింగ్టన్ డిసిలోని నేషనల్ వాల్, కోర్సిక, పెరూలోని చెక్వక్వరియో, ఛానల్ ఐస్లాండ్‌లోని సార్క్, జపాన్‌లోని కోయసాన్, ఓక్లహోమా నగరం, రోమేనియాలోని మారమ్యూరస్‌లు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా ఈ మొత్తం 20 ప్రదేశాల్లో తన ఫేవరేట్లుగా పేర్కొంటూ బ్రిటన్‌కు చెందిన డెయిలీ మెయిల్ పత్రిక టాప్-7 పేరిట ఓ జాబితాను ప్రచురించింది. అందులో హైదరాబాద్ నగరానికి 7వ స్థానం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+