TTD: తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ - టీటీడీ కీలక నిర్ణయం..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు నిర్వహించనున్నారు. కీలకమైన గరుడ వాహన సేవ అక్టోబర్ 8న నిర్వహిస్తారు. ఈ సమయంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
బ్రహ్మోత్సవాలు
అక్టోబర్ 4న సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం. 6న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు. 7న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవలు
అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. 9న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ ఉంటుంది. 10న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు. అక్టోబర్ 11న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం సేవ నిర్వహించనున్నారు. 12న ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం ఉంటాయి.

టీటీడీ ఏర్పాటు
బ్రహ్మోత్సవాల్లో రెండు, మూడు, నాలుగో రోజుల్లో మధ్యాహ్నం సమయంలో రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు స్నపనం తిరుమంజనం నిర్వహించను న్నారు. ఇక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహనసేవకు లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాలు, సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications