శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)

హైదరాబాద్: దోపిడీ దొంగ శివ భార్య తోపాటు ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4.5 లక్షల నగదు, 3.5 కిలోల బంగారం, రెండు కార్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 700 కేసుల్లో శివ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు గుర్తించామని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలోనే 510 కేసులున్నాయని చెప్పారు. ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ప్రతినిధులను అరెస్ట్ చేసినట్లు సివి ఆనంద్ తెలిపారు.

కాగా, ఇటీవల శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పుల్లో చైన్ స్నాచర్ శివ మృతి చెందాడు. అయితే అతని జీవనశైలి దిగ్భ్రమ కలిగించే విధంగా ఉన్నట్లు చెప్పారు. పోలీసులకే అది ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. నార్సింగ్‌లోని శివ అద్దెకు ఉంటున్న ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్‌లో అతని లగ్జరీ జీవితానని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఆ సమయంలో అతను ఉపయోగిస్తున్న ఫర్చీచర్, ప్లాస్మా టీవీ నుంచి అక్వేరియం వరకు అన్ని అత్యంత ఖరీదైనవే. రెండు లగ్జరీ కార్లు, ఓ స్పోర్ట్స్ బైక్, స్కూటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తి విశాలమైన ఇల్లు, ఖరీదైన ఇంటీరియర్స్ చూసిన పోలీసులు నిరుత్తురులైనట్లు వార్తలు వచ్చాయి. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే శివ ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించేవాడని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి ఇల్లు మారేవాడు.

భార్యతో శివ

భార్యతో శివ

దోపిడీ దొంగ శివ భార్య తోపాటు ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన శివ

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన శివ

వారి నుంచి రూ. 4.5 లక్షల నగదు, 3.5 కిలోల బంగారం, రెండు కార్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన శివ

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన శివ

700 కేసుల్లో శివ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు గుర్తించామని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.

శివ అనుచరులు

శివ అనుచరులు

సైబరాబాద్ పరిధిలోనే 510 కేసులున్నాయని చెప్పారు. ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ప్రతినిధులను అరెస్ట్ చేసినట్లు సివి ఆనంద్ తెలిపారు.

ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసుకుని అతడు చిరునామా అడుగుతున్నట్లు నటించి వారి మెడల్లోని బంగారు ఆభరణాలను లాక్కుని వెళ్లేవాడు. అప్పటికే మరొకరు కారులో సిద్ధంగా ఉండగా, ఆ వాహనంలో ఎక్కి శివ పారిపోయేవాడని చెబుతున్నారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలను అమ్మి బార్యాపిల్లలతో ఇతర రాష్ట్రాలకు విహార యాత్రలకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడు.

అంతేకాకుండా, తన భార్య ఖాతాలో డబ్బులు వేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో ఓసారి పోలీసులకు చిక్కినట్లే చిక్కి పరారయ్యాడు. కొంత కాలం క్రితం అతను ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు శివ నివాసాన్ని గుర్తించారు. శివ భార్యతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+