విజయనగరానికీ పాకిన కరోనా.. మూడు పాజిటివ్ కేసులు... 1833కు చేరిన మొత్తం...
ఏపీలో కరోనా ప్రభావం లేని జిల్లాగా ఇన్నాళ్లూ భావించిన విజయనగరానికీ వైరస్ సోకింది. గత 24 గంటల్లో విజయనగరం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1833కు చేరింది. ఇందులో ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 1015 కాగా.. డిశ్చార్జ్ అయిన వారు 780 మంది. మరో 38 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు.
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8087 శాంపిల్స్ పరీక్షించగా... మొత్తం 56 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయనగరం జిల్లాలో మూడు కేసులు నమోదు కాగా.. అనంతపురం 3, గుంటూరు 10, కృష్ణా 16, కర్నూలు 7, కడప 6, నెల్లూరు 4, విశాఖ 7 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి తలొకరు చికిత్స పొందుతూ చనిపోయారు.

Recommended Video
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 51 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే 21 మంది ఉన్నారు. కర్నూల్లో 15, కృష్ణాలో 6, అనంతపురంలో 5, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఒకరు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 780కి చేరింది.












Click it and Unblock the Notifications