అమ్మాయిల అదృశ్యం: దొరికిన ఆచూకీ, ఊపిరి పీల్చుకున్న పేరెంట్స్
గుంటూరు: గుంటూరులో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమైన సంచలన సంఘటన సుఖాంతమైంది. ఇంట్లో స్వేచ్ఛలేదని, ప్రతీ చిన్న విషయానికి నింబధనలు పెడుతున్నారని లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన పాత గుంటూరు రాఘవయ్యనగర్‌కు చెందిన బాలికల ఆచూకీ లభ్యమైంది. 7,8 తరగతులు చదువుతున్న అక్కాచెల్లెళ్లు లక్కిరెడ్డి దివ్య, ఊహ, స్నేహితురాలు ముచ్చుకోట యశస్విని ఈనెల 13 స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
బాలికల అదృశ్యంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరులో అదృశ్యమైన బాలికలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగినట్టు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో తేలింది. బాలికలు కూకట్‌పల్లి పోలీసుల అదుపులో ఉన్నారని తెలియడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వారి అదృశ్యమైన పలు రకాల కథనాలు, ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.
లేఖారెడ్డి, దివ్య, యశస్విని అనే వీరు ముగ్గురూ ఈ నెల 14న గుంటూరులో అదృశ్యమై 15వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగారని పోలీసులు గుర్తించారు. వీరి ముగ్గుర్ని ఓ యువతి కిడ్నాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు ముగ్గురు అమ్మాయిలను ఎత్తుకొచ్చినట్టు అనుమానించారు. కానీ, వాటిలో నిజం లేదని తేలిపోయింది.
అమ్మాయిల కుటుంబ సభ్యులు వారి అదృశ్యంపై పెదవి విప్ప లేదు. 14వ తేదీన వారు అదృశ్యం కాగా, పోలీసులు 15వ తేదీన కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులకు ఉన్నతాధికారులు ఆ బృందాలను పంపించారు. అయితే, సికింద్రాబాదు రైల్వే స్టేషన్ సిసి టీవీ కెమెరాల్లో వారి ఫొటోలు కనిపించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. సికింద్రాబాదులో రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సిసి టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆ ముగ్గురు యువతులతో పాటు మరో యువతి ఉండడం అనుమానాలకు తావు ఇస్తోందని వార్తాకథనాలు వచ్చాయి. ఆ యువతే వారిని గుంటూరు నుంచి హైదరాబాద్ తీసుకుని వచ్చి ఉంటుందని కూడా కథనాలు వచ్చాయి. వారు ముగ్గురు కూడా ఇంటి నుంచి వచ్చేటప్పుడు బంగారం, డబ్బు తీసుకుని వచ్చినట్లు సమాచారం.
ముగ్గురు అమ్మాయిలు కూడా బంధువులు అవుతారని, వారిలో ఇద్దరు వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారని సమాచారం. పోలీసులు కూడా వారి గురించి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications