గర్ల్స్‌ని తరలించే ముఠా అరెస్ట్, విదేశీ గర్ల్స్ కేసులో వ్యక్తి

Three member gang arrested by police
హైదరాబాద్/విశాఖ: అమ్మాయిలకు భారీ మొత్తంలో జీతాలు ఆశచూపి, విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను అబుదాబి దేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తూ ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కింది.

వివరాల ప్రకారం.. అబుదాబి దేశంలోని ఒక హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న వ్యక్తి అమ్మాయిల తరలింపునకు వ్యూహం రచించాడు. దీనికి అతని సోదరి, స్నేహితురాలు సహకరించారు. వీరిద్దరూ కూడా అబుదాబిలోని అదే హోటల్‌లో క్లబ్ డాన్సర్లుగా పని చేస్తున్నారు.

కొద్ది రోజుల కిందట విశాఖ చేరుకున్న వీరు నగరంలోని ఒక స్టార్ హోటల్‌లో బస చేశారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొంతమంది యువతులను ఆకర్షించారు. క్లబ్ డాన్సర్‌గా పని చేస్తున్న యువతి సోదరుడు ఒకరు పరిచయాలను అడ్డుపెట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్‌లను కొంతమందిని విశాఖ పంపాడు. వీరితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి యువతులను ఇంటర్వూలకు పిలిచి భారీ ఆదాయం ఉంటుందని నమ్మించారు.

హోటల్‌లో పని చేసేందుకు లక్షల రూపాయల జీతం వస్తోందని నమ్మిన ఈ యువతులు అబుదాబి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్వూలకు 10 మంది యువతులు హాజరుకాగా, వీరిలో ఆరుగురు యువతులను ఎంపిక చేశారు. వీరిని అబుదాబి తరలించేందుకు వీసా, పాస్‌పోర్టులను కూడా సిద్ధం చేశారు. అయితే నిందితుల కదలికలు అనుమాస్పదంగా కన్పించడంతో పోలీసులు నిఘా వేయటంతో విషయం బయటపడింది.

యువతులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

నకిలీ ప్రొఫైల్ ద్వారా విదేశీ యువతనులను మోసం చేస్తున్న పర్వేజ్ అలీ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వీడియో చాటింగ్‌ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడని డిసిపి పాలరాజు తెలిపారు. ఇతడి వల్ల అమెరికాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. నిందితుడు కొన్ని బ్యాంకులను కూడా మోసం చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+