పోలీస్ స్టేషన్‌లోనే మందు దుకాణం... ఆ ముగ్గురు కానిస్టేబుళ్లకు ఎస్పీ షాక్...

హిందూపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లు మందు పార్టీ చేసుకున్న వీడియోలు వెలుగుచూశాయి. పైగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లనే మందు పార్టీకి వాడినట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై ఎస్పీ సీరియస్‌గా స్పందించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం... నివేదిక రావడం... ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు పడటం చకచకా జరిగిపోయాయి.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

హిందూపురం పట్టణంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఈనెల 4వ తేదీన హెడ్‌కానిస్టేబుళ్లు తిరుమలేశ్‌, నూర్‌మహ్మద్‌, కానిస్టేబుల్‌ గోపాల్‌నాయక్‌ విధులకు హాజరయ్యారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ పైఅంతస్తులో ఉన్న రెస్ట్ రూమ్‌లో బస చేశారు. ఈ సందర్భంగా అక్కడే సీజ్ చేసి పడేసి ఉన్న మద్యం సీసాల్లో నుంచి కొన్ని సీసాలను బయటకు తీశారు.

గంటల వ్యవధిలోనే సస్పెన్షన్

గంటల వ్యవధిలోనే సస్పెన్షన్

అవే మద్యం సీసాలతో మందు పార్టీ చేసుకున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోమవారం(జూలై 6) ఇవి బయటకు పొక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. ఎస్పీ సత్య ఏసుబాబు రంగంలోకి దిగి దీనిపై విచారణకు ఆదేశించారు. గంటల వ్యవధిలోనే డీఎస్పీ మహబూబ్ పాషా ఎస్పీకి నివేదిక అందజేశారు. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

Recommended Video

    Vikas Dubey : జైల్లో నుంచే స్కెచ్ లు.. మంత్రి, బంధువుల హత్యలు..!! || Oneindia Telugu
    సీసీటీవీ ఫుటేజీ ఎలా లీకైనట్లు..?

    సీసీటీవీ ఫుటేజీ ఎలా లీకైనట్లు..?

    మరోవైపు సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్ గోపాల్ నాయక్ తనకు మద్యం అలవాటు లేదని చెప్పడం గమనార్హం. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఆ గదిలోకి వెళ్తానని... ఆరోజు కూడా అందుకే వెళ్లానని చెప్పాడు. అన్యాయంగా తనపై వేటు వేయడం సరికాదన్నారు. పోలీస్ స్టేషన్‌లో మద్యం సేవించిన దృశ్యాలు మీడియాకు ఎలా లీక్ అయ్యాయన్నది ఎస్పీకి కూడా అంతుచిక్కడం లేదు. సీసీటీవీ ఫుటేజీ లీకేజీకి బాధ్యులెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+