విషాదం: గోదావరి నదిలో గల్లంతైన ముగ్గురు యువకులు మృతి

తూర్పుగోదావరి: గోదావరిలో గల్లంతైన ముగ్గురు యువకుల కథ విషాదాంతంగా ముగిసింది. ఆ ముగ్గురు యువకులూ గోదావరి నదిలో విగతజీవులుగా తేలారు. యువకుల మృతి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మండలం శెట్టిపేటకు చెందిన కూడిపూడి ప్రేమ్ సాగర్(17), మామిడిశెట్టి బాలవెంకట రమణ(19, ఫణికుమార్(19)) స్నేహితులు. బుధవారం వీరంతా అమలాపురం నుంచి ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తర వాహిణీ పుష్కర రేవు వద్దకు స్నానాలకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.

three young men died in godavari river in east godavari district

అయితే, ఈ ముగ్గురు యువకులు ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబసభ్యులకు సమాచారం లేకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ తర్వాత గురువారం వారి తల్లిదండ్రులు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువకుల మొబైల్ కాల్ చేయగా ఓ పశువుల కాపరి వాళ్ల పోన్లో మాట్లాడాడు.

పుష్కర రేవు వద్ద బైక్‌పై బట్టలు, ఫోన్లు ఉన్నాయని, నదిలో ఓ మృతదేహం తేలియాడుతోందని అతడు చెప్పాడు. ఆ యువకుల మొబైల్ ఫోన్ల సిగ్నళ్లు కూడా అక్కడే గుర్తించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత పోలీసులు, కుటుంబసభ్యులు సంఘటనా స్థలికి చేరుకుని యువకుల మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+