వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pick talk: దోస్త్ మేరా దోస్త్.. తూ హై మేరా జాన్!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. క్రౌడ్ పుల్లింగ్ చేయగల కెపాసిటీ ఉన్న మాస్ హీరో. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నారు. 2001లో నిన్ను చూడాలని మూవీతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1తో బ్రేక్ అందుకున్నారు. అంతకుముందు బాలనటుడిగా బాల రామాయణం శ్రీరామచంద్రుడి పాత్రలో మెరుపులు మెరిపించారు. 30వ సినిమా పనుల్లో బిజీగా ఉంటోన్నారు.

వీడియో: మేమేమైనా కడప రౌడీలమా? అంటూ వాదించిన టీడీపీ నేతకు అద్దిరిపోయే జవాబిచ్చిన డీఎస్పీవీడియో: మేమేమైనా కడప రౌడీలమా? అంటూ వాదించిన టీడీపీ నేతకు అద్దిరిపోయే జవాబిచ్చిన డీఎస్పీ

రాజకీయాలకు దూరంగా..

రాజకీయాలకు దూరంగా..

రాజకీయాలపైనా ఆయనకు ఆసక్తి ఉంది. 2009లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. క్రియాశీలకంగా వ్యవహరించారు. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. మహానాడులోనూ పాల్గొన్నారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో- టీడీపీకి దూరం అయ్యారు. రాజకీయాల వైపు వెళ్లలేదు. తన కేరీర్‌పైనే పూర్తిగా దృష్టి సారించారు.

 అమిత్ షాతో భేటీతో..

అమిత్ షాతో భేటీతో..

తాజాగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించినందుకు ఆయనను అభినందించడానికే ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిశాడంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేస్తోన్నప్పటికీ.. దాన్ని ఎవరూ నమ్మట్లేదు. రాజకీయ కారణాలు లేనిదే ప్రధాని నరేంద్ర మోడీ గానీ, అమిత్ షా గానీ ఎవరినీ కలవబోరనే వాదన ఉంది.

ఎన్టీఆర్‌-నాని-వంశీ..

ఎన్టీఆర్‌-నాని-వంశీ..

జూనియర్ ఎన్టీఆర్‌-మాజీ మంత్రి కొడాలి నాని-ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన ఓ అన్ సీన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయాలకు ఎన్టీఆర్ సెంటర్ పాయింట్‌గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిక్ పోస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ఒడిలో జూనియర్ కాలు పెట్టి కూర్చున్న ఓ పాత ఫొటో అది.

అనుబంధానికి నిదర్శనంగా..

అనుబంధానికి నిదర్శనంగా..

ఈ ముగ్గురి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి నిదర్శనం ఈ ఫొటో. నాని పక్కనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. తారక్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలా సందర్భాల్లో చెప్పుకొన్నారు. తాజాగా వైరల్‌గా మారిన ఫొటో.. సినిమా షూటింగ్ గ్యాప్‌లో తీశారనేది అక్కడున్న వాతావరణాన్ని బట్టి చెప్పేయొచ్చు.

సాంబ సినిమా నాటి స్టిల్..

సాంబ సినిమా నాటి స్టిల్..

వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సాంబ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటో అది. దీనికి కొడాలి నాని నిర్మాత. కొడాలి మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కింది. ఆ తరువాత వీవీ వినాయక్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేసిన అదుర్స్ సినిమాకు వాళ్లే నిర్మాతలు. వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కిందా మూవీ. దీనికి కొడాలి నాని సమర్పకుడిగా, వల్లభనేని వంశీ నిర్మాతగా వ్యవహరించారు.

English summary
Throwback pic: Jr NTR, Kodali Nani and Vamsi: Un seen picture viral on social media, what is in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X