కోస్తాంధ్రకు చల్లని కబురు: రాబోమే మూడ్రోజులపాటు వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కోస్తా వాసులకు చల్లని కబురు. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో చల్లని వాతావరణమే ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది.
Recommended Video
ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీంతో రాగల మూడు రోజులపాటు ఏపీలో చల్లని వాతావరణం ఉండనుంది. నేటి నుంచి ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఏప్రిల్ 20న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారంనాడు దక్షిణ కోస్తాంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురువనున్నాయి.
మరోవైపు రాయలసీమలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగాక, గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 సెంటీగ్రేడ్ల అధికంగా పలు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 21న రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications