times now survey: ఏపీ, తెలంగాణలో జగన్, కేసీఆర్ పార్టీలదే హవా, ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే?

న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ(Times now) 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు వచ్చే లోక్‌సభ స్థానాలను అంచనా వేసింది. అయితే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకే అత్యధిక స్థానాలు రావడం గమనార్హం. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను దక్కించుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వైయస్సార్సీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ తెలిపింది. వైయస్సార్సీపీకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 24 నుంచి 25 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంకు 0-1 ఎంపీ స్థానం దక్కే అవకాశం ఉందని తేల్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలున్న విషయం తెలిసిందే.

times now survey on lok sabha elections in telangana and andhra pradesh: details here

కాగా, వైయస్సార్సీపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు, వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైయస్సార్సీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఏపీ ప్రజలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తారని స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ జోరు

తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార పార్టీకే అత్యధిక స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి 9 నుంచి 11 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని టౌమ్స్ నౌ సర్వే పేర్కొంది. ఇక బీజేపీకి రెండు నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీ 3-4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతరులకు ఒక సీటు లభిస్తుందని తెలిపింది. గత నెల (సెప్టెంబర్)లో నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ తాజాగా వెల్లడించింది. కాగా, తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+