తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం - భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!!
తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా డిసెంబర్ వరకు సిఫారసు లేఖ లు అనుమతించటం లేదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కాగా.. ఇదే సమయంలో తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం భక్తులకు ఇబ్బందిగా మారింది. దీంతో.. టీటీడీ కీలక సూచనలు చేస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తిరుమల లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా పడుతున్న వర్షం కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి నుంచి వర్షం మరింత పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు తిరుమలలోని ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భక్తులు వర్షంలో తడుస్తూనే క్యూలైన్లలో దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన భక్తులు వసతి గదుల బయట పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. కాగా.. భారీ వర్షం వేళ టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేస్తోంది.

భక్తులకు కీలక సూచనలు
భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తం చేస్తున్నారు. కాగా, ఈ భారీ వర్షాల వేళ తిరుమల కొండపైకి వెళ్లే, కిందకు వచ్చే వాహనదారులు అత్యంత జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రయాణించాలని టీటీడీ అధికారులు చిస్తున్నారు. శ్రీవారి పుష్కరిణిలో చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులతో కలిసి అన్ని విభాగాల సమన్వయంతో టీటీడీ ఉన్నత అధికారులు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఇక.. స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా వచ్చే నెల వరకు తిరుమలో సీఫారసు లేఖలను అనుమతించటం లేదని టీటీడీ ప్రకటించింది.













Click it and Unblock the Notifications
