శ్రీవారి లడ్డూ కల్తీపై నమో వెంటేశాయ అంటూ నారా లోకేష్

Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో వాస్తవాలేమిటనేది వెలుగులోకి వస్తోన్నాయి.

ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తోన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోన్నారు. ఇందులో నిజనిజాలేమిటో బయటపెట్టడానికి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఓ ఇండిపెండెంట్ సిట్ ను నియమించింది.

Tirumala Laddu Adulterates to Face Legal Consequences says Nara Lokesh

తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే కొట్టివేసింది. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు, ప్రజా శాంతి పార్టీ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ ను తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని వ్యాఖ్యానించింది.

తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాన్ని బయటపెట్టిందని అన్నారు. దోషులు చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కొంటారని తేల్చి చెప్పారు. ఇది కల్తీ మాత్రమే కాదని, కోట్లాదిమంది హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. మన విశ్వాసాన్ని అపవిత్రం, దేశ ఆత్మపై దాడి చేయడంతో సమానమని వ్యాఖ్యానించారు. పవిత్రతతో ఆటలాడిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ.. అంటూ తన ట్వీట్ ను ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+