లడ్డూ విచారణ వారి చేతికే - సుప్రీంలో కీలక పరిణామం..!?
తిరుమల లడ్డూ వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ వివాదం పై విచారణ పైన నేడు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నియమించిన సెట్ ను కొనసాగించాలా..లేక కేంద్ర విచారణ జరుగుతోందా అనేది స్పష్టత రానుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును వెల్లడించనున్నారు.
సుప్రీంలో విచారణ
తిరుమల లడ్డూ వ్యవహారంలో కేంద్రం వైఖరి పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లడ్డూ వివాదం పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ తాజాగా సుప్రంకోర్టులో విచారణ వేళ తాత్కాలికంగా విచారణ నిలిపివేసింది. ఈ సయంలోనే విచారణ పైన కేంద్ర అభిప్రాయాన్ని సుప్రీం కోరింది. గురువారం కోర్టులో ఈ అంశం విచారణకు రాగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని శుక్రవారం చెబుతామని, అప్పటివరకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు.

కేంద్ర అభిప్రాయం
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. శుక్రవారం దీనిని తొలి కేసుగా విచారిస్తామని తెలిపింది. వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కేసు విచారణకు రావలసింది.దానికి కొద్ది నిమిషాల ముందు తుషార్ మెహతా హాజరై ధర్మాసనం అనుమతిస్తే శుక్రవారం ఉదయం కచ్చితంగా 10.30 గంటలకు తన స్పందన తెలియజేస్తానని అన్నారు. రాష్ట్రం వేసిన సిట్‌ను మరికొందరు అధికారులతో విస్తరించాలా.. లేక సీబీఐ తరహాలో కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు జరిపించాలా అన్న అంశంపై మెహతా తన అభిప్రాయం వెల్లడించనున్నారు.
విచారణ పై నిర్ణయం
సుప్రీంకోర్టు ఏ రకమైన దర్యాప్తునకు ఆదేశించినా తమకు అభ్యంతరం లేదనే ఆయన చెప్పే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలై ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను గురువారం రాత్రి సంప్రదించిన తర్వాత మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిర్ధారించే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఈ లడ్డూ వివాదం పైన విచారణ కోసం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications