తిరుమలలో ఇక చింత లేకుండా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వీటి తీవ్రత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటోంది. ప్రత్యేకించి.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఫలితంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఉండే జలాశయాలన్నీ కూడా గరిష్టస్థాయి నీటిమట్టాన్ని అందుకుంటోన్నాయి. చాలినంత నీరు వచ్చి చేరింది.
తిరుమలలోని అయిదు ప్రధాన జలాశయాల్లో శుక్రవారం వరకు ఉన్న నీటినిల్వల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఒక్కో రిజర్వాయర్ లో ఎంతమేర నీరు నిల్వ ఉందో వివరించింది. ఈ అయిదింట్లోనూ కలిపి మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీటి మట్టం పెరిగినట్టు తెలిపింది. పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార రిజర్వాయర్లల్లో 21.60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా.. ఇంకా 40.08 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా నిల్వ ఉన్నట్లు పేర్కొంది.

పాపవినాశనం డ్యామ్
నిల్వ సామర్థ్యం: 5,240.00 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 2,688.35 లక్షల గ్యాలన్లుగా రికార్డయింది.
గోగర్భం డ్యామ్
నిల్వ సామర్థ్యం: 2,833.10 లక్షల గ్యాలన్లు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 508.31 లక్షల గ్యాలన్లుగా నమోదైంది.
ఆకాశగంగ
ఈ రిజర్వాయర్ సామర్థ్యం 685.00 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుతం 30.40 లక్షల గ్యాలన్ల నీరు ఇక్కడ నిల్వ ఉంటోంది.
కుమారధార
ఈ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4,259.01 లక్షల గ్యాలన్లు ఉండగా.. శుక్రవారం నాటికి 363.98 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది.
పసుపుధార డ్యామ్
పసుపుధార జలాశయం నిల్వ సామర్థ్యం 1,287.54 లక్షల గ్యాలన్లు కాగా.. 24.38 లక్షల గ్యాలన్ల నీళ్లు అదనంగా వచ్చి చేరింది ఈ వర్షాల వల్ల.
మొత్తం ఈ అయిదు డ్యామ్ లల్లో కూడా 61.68 లక్షల గ్యాలన్ల నీరు పెరిగింది. ఇందులో 21.60 లక్షల గ్యాలన్ల నీటిని టీటీడీ ఇప్పటికే వినియోగించింది. ప్రస్తుతం 40.08 లక్షల గ్యాలన్ల మిగులివుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో 7.02, నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో 148.48 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరినట్లు టీటీడీ పేర్కొంది. తాజాగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడబోతోండటం, అది తుఫాన్ గా మారే పరిస్థితులు ఉన్నందున మరిన్ని భారీ వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తిరుమల జలాశయాల్లో నీటిమట్టం మరింత పెరగొచ్చు.













Click it and Unblock the Notifications
