శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- దర్శనానికి ప్లాన్ చేయండి ఇక.. !!

మార్చి 2026లో శ్రీవారి దర్శనాలు, వివిధ ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా వివరాలు విడుదల అయ్యాయి. టీటీడీ అధికారులు వీటిని విడుదల చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవలకు సంబంధించిన మార్చి నెల కోటా ఈ నెల 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు, శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌ వ‌సంతోత్స‌వాల‌ టికెట్లు ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల అవుతాయి. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతుంది టీటీడీ.

Tirumala SED and accommodation Tickets for March 2026 Are Opening this dates

23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల అవుతుంది. అదే రోజు 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను కూడా ఆన్ లైన్ లో నే అందుబాటులోకి వస్తుంది. ఈ రెండు సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు ఆన్ లైన్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవడానికి వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23వ తేదీ నాడే మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. తిరుమల, తిరుపతిల‌లో వసతి గదుల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి వస్తాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+