తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, అనూహ్య రద్దీ వేళ..!!
తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవులు... పెరటాసి మూడో శనివారం సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తమిళనాడు, కర్ణాటకతో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో రద్దీ పెరిగింది. గోవింద మాలలు ధరించిన భక్తుల గోవింద నామస్మరణతో తిరుపతి మార్మోగుతోంది. కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలలో ఆక్టోపస్ బిల్డింగ్ నియర్ గోగర్భం డ్యాం వరకు భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల భక్తులతో కిక్కిరిసి పోయింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ వెల్లడించింది. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా రేపు (ఆదివారం) వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రోజు (శనివారం) శనివారం దర్శనానికి సంబంధించి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద శుక్రవారం ఉదయం 5 గంటలకే 10,000 సమయ నిర్దేశిత ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేశారు. గంటలోపే టోకెన్లు పూర్తయ్యాయి. వీరికి శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు మరో 2,000 టోకెన్లు జారీ చేశారు.

వరుస సెలవులతో భారీ రద్దీ
కాగా.. టోకెన్ల కోసం ఆయా కేంద్రాల వద్ద వేలాది మంది భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 7 గంటల తర్వాత వచ్చిన భక్తులకు టోకెన్లు లేకపోవడంతో నిరాశ చెందారు. దాదాపు 18,000 నుంచి 23,000 మంది భక్తులు తరలి వచ్చారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలు బారులు తీరగా, రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య మరోసారి రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో దాదాపు 12,217 వాహనాలు తిరుమలకు వెళ్లినట్లు అంచనా వేసారు. టీటీడీ తిరుమలలో భక్తుల అధిక రద్దీని దృషిలో ఉంచుకుని ఎక్కువ మంది సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అక్టోబర్ 5న కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. టీటీడీ అధికారులు, సిబ్బంది, దర్శన క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని భక్తులను కోరుతున్నారు.













Click it and Unblock the Notifications
