TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, శ్రీవారి సేవా టిక్కెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 18వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

సెప్టెంబరు 21వ తేదీన వర్చువల్ సేవల కోటా విడుదల
. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
సెప్టెంబరు 23వ తేదీ న అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తున్నారు.
డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టిక్కెట్లు విడుదల చేస్తున్నారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
సెప్టెంబరు 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
చేస్తున్నారు. డిసెంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల చేస్తున్నారు. తిరుమల, తిరుపతిలలోని టీటీడీ గదుల కోటాను విడుదల చేస్తున్నారు. డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

సెప్టెంబరు 27వ తేదన శ్రీవారి సేవ కోటా విడుదల
చేస్తున్నారు. సెప్టెంబరు 27వ తేదీన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ మంగళవారం సాయత్రం కోరారు.












Click it and Unblock the Notifications