TTD: శ్రీవారి లడ్డు ప్రసాదం - అరుదైన రికార్డు, తాజాగా..!!
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి. స్వామి వారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఈ లడ్డూ ప్రసాదం కు ఎంతో ప్రత్యేకత ఉంది. కాగా, ఈ ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు. ఇంత ప్రత్యేకత ఉన్న తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు లక్షల లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి.
తిరుమల లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీవారి భక్తులు ఈ లడ్డూ ప్రసాదం ను చాలా పవిత్రంగా భావిస్తారు. కాగా.. టీటీడీ భక్తులకు కోరిన విధంగా లడ్డూ ప్రసాదం అందించేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. తిరుమలలో ఈ ఏడాది జూలై 12న రికార్డు స్థాయిలో 4 లక్షల 86 వేల 134 లడ్డూలు విక్రయించారు. గత ఏడాది ఇదే రోజున 3.24 లక్షలు విక్రయించగా, 35 శాతం వరకు ఈ సారి అమ్మకాలు పెరిగాయి. దీంతో.. ఆ ఒక్క రోజులోనే లడ్డూ విక్రయం ద్వారా 2.43 కోట్లు టీటీడీకి ఆదాయంగా సమ కూరింది. గత ఏడాది జూలై నెలలో లడ్డూల ఉత్పత్తి చిన్నవి 160-180 గ్రామాలు 1,04,57,550 ఉండగా.. ఈ ఏడాది జూలై లో 1,25,10,300 కు పెరిగింది. గత జూలైలో 1,04,03,719 లడ్డూలు అమ్మకాలు జరిగాయి.

కాగా, ఈ ఏడాది జూలైలో 1,24,40,082 లడ్డూలు విక్రయాలు జరిగాయి. దీంతో పాటుగా భక్తుల రద్దీ పెరిగినప్పుడు సరిపడా అవసరాల కోసం బఫర్ స్టాక్ కోసం నాలుగు లక్షలు పెట్టుకున్నారు. లడ్డూ నాణ్యత విషయంలోనూ టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా.. పరీక్షల కోసం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇక.. తిరుమలలో వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం సెలవుల రోజుల్లో గతం కంటే భారీగా వస్తున్న భక్తుల కోసం అమలు చేస్తున్న క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇక.. ప్రస్తుతం నవంబర్ మాసానికి సంబంధించిన దర్శనం.. వసతి.. సేవా టోకెన్ల పంపిణీ జరుగుతోంది.












Click it and Unblock the Notifications