తిరుమ‌ల స్వామివారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాలు.. నేడు అంకురార్ప‌ణ‌..

క‌ళియుగ వైకుంఠ దైవ‌మైన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామిని కొలిచేందుకు నిత్యం భ‌క్తులు బారులు తీరుతుంటారు. తిరుమ‌ల దేవ‌స్థానంలో నిత్యం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయి. నేటి నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా బ్రహ్మోత్సవ కార్య‌క్ర‌మానికి నేడు అంకురార్పణం చేపడతారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం ఎంతో ముఖ్యమైనది. ఈ బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ శ్రీ‌వారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ‌వారి ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ చేస్తారు. ఆ త‌ర్వాత రాత్రి 7 గంటలకు మాడవీధులగుండా ఊరేగింపు కార్య‌క్ర‌మం ఉంటుంది. అనంత‌రం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చకస్వాములు కైంకర్యాలు నిర్వహించి స్వామివారికి అంకురార్పణ చేస్తారు. దీంతో తిరుమ‌ల వారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. తిరుమల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేది నుండి 12వ తేది వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబ‌రు 03 రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం కార్య‌క్ర‌మం ఉంటుంది.

Tirumala Swami s Salakatla Brahmotsavalu Ankurarpana today

9 రోజులపాటు బ్ర‌హ్మోత్స‌వాలు..

ఈ అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగానే పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. ఆ నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తూ ఉంటారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం అని అర్థం. ఈ అంకురార్పణ కార్య‌క్ర‌మాన్ని సాధారణంగా సాయంత్రం వేళలో మాత్ర‌మే నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి.ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి అన్నది నమ్మకం. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం ఉంటుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు కార్య‌క్ర‌మం ఉంటుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి తీసుకొస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం అంకుర్పారణ కార్య‌క్ర‌మం జరుగుతుంది. ఈ బ్ర‌హ్మోత్స‌వాలు 9 రోజులపాటు జరగనున్నాయి. అక్టోబర్ 4వ తేది నుంచి 12వ తేది వరకు ఎంతో వైభవంగా నిర్వ‌హిస్తారు. ప్రతి రోజు ఉదయం 8 గంట‌ల నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య వాహన సేవ కార్య‌క్ర‌మాలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+