తిరుమల కిటకిట, భక్తుల నిరసనలు- రద్దీ తగ్గే వరకూ ఇక... టీటీడీ కీలక నిర్ణయం..!!

తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవులతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. పెరటాశి మూడో శనివారం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. రద్దీ పెరుగుతున్న క్రమంలో క్యూలైన్‌లోకి భక్తులను విడతలవారీ అనుమతించారు. బ్రేక్ దర్శన లేఖలతో వచ్చిన భక్తులు ఆ దర్శనాలు రద్దు చేయటం పైన నిరసనకు దిగారు. కాగా.. రద్దీ తగ్గే వరకూ శ్రీవాణి కోటా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు.

తిరుమలలో రద్దీ పెరిగింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. రాత్రి 10 గంటలకు క్యూలైన్‌ మూసివేసి తిరిగి ఒంటిగంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. బుధవారం కూడా క్యూలైన్‌ నిండిన వెంటనే ప్రవేశాన్ని మూసివేస్తూ, ఖాళీ అయిన వెంటనే తిరిగి అనుమతించారు. తమిళనాడు భక్తబృందం తమను దర్శనానికి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొందరు భక్తులు డీటైప్‌ క్వార్టర్స్‌ వద్ద రోడ్డుపై నిరసనకు దిగారు. కాగా.. ఇప్పటికే రద్దీ కారణంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే, బుధవారం ఉదయం సిఫారసు లేఖలతో అదనపు ఈవో కార్యాలయానికి కొందరు భక్తులు రాగా... సిఫారసు లేఖలు తీసుకోబోమని సిబ్బంది చెప్పారు. ఈక్రమంలో కొందరు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. దీంతో సిఫారసు లేఖలతో వచ్చిన వారికి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు కేటాయించి పంపారు.

ఉద్యోగులకు పీఆర్సీ - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!!
ఉద్యోగులకు పీఆర్సీ - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!!
tirumala-temple-sees-heavy-devotee-rush-as-vaikuntam-queue-complex-fills-up-here-the-details

రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయాలు

కాగా, బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టు మెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ అక్టోపస్‌ భవనం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 20 గంటల దర్శన సమయం పడుతోంది. ఈ నెల4వ తేదీ సైతం సిఫారసు లేఖలు తీసుకోవటం లేదని.. 5వ తేదీన బ్రేక్ దర్శనాలు ఉండవని.. ఇందుకు భక్తులు సహకరించాలని టీటీడీ సూచిస్తోంది. కాగా.. రద్దీ కొనసాగుతున్న వేళ కరెంట్ బుకింగ్ కింద రోజూ ఆన్ లైన్ లో కేటాయిస్తున్న 500 శ్రీవాణి టికెట్లను టీటీడీ సగానికి కుదింపు చేయాలని నిర్ణయించింది. దాతల అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు 300 నుంచి 250కి తగ్గించారు. బుధవారం మొత్తంగా 500 టికెట్లను మాత్రమే జారీ చేయగా.. రద్దీ తగ్గే వరకూ ఇదే విధానం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+