ఇకపై క్యూలైన్, కంపార్ట్ మెంట్స్ లల్లో..: టీటీడీ తాజా గైడ్ లైన్స్!!

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే ఉత్తర ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.

ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన సదుపాయం లభిస్తుందని టీటీడీ తేల్చి చెప్పింది. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన టైమ్ స్లాట్ లో మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాలని సూచించింది. దర్శనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజా సంబంధాల విభాగం, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది.

Tirumala Visiting Guidelines What Devotees Should Know During Vaikunta Darshan

భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రయాణాలను రూపొందించుకోవలసిందిగా టీటీడీ సూచించింది. ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తెలిపింది. ఎటువంటి సిఫారసు లేఖలు కూడా స్వీకరించబోమని పేర్కొంది.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను పుర‌స్క‌రించుకుని విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా డిసెంబ‌ర్ 28 నుండి జ‌న‌వ‌రి 7వ తేది వ‌ర‌కు తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తుల‌కు ఇచ్చే సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఇప్పటికే రద్దు చేసింది కూడా. భ‌క్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన స‌దుపాయాల‌ను వినియోగించుకునేందుకు వివిధ భాష‌ల్లో సూచిక‌ బోర్డుల‌ను కూడా క్యూలైన్ల‌ు, ముఖ్య‌మైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

భక్తుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని క్యూలైన్ల‌లో ప‌లు మార్పులు చేప‌ట్టింది. క్యూలైన్ల‌లో భ‌క్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయ‌డంతో పాటు, తాగునీటి సౌక‌ర్యం, క్యూలైన్ల‌కు అనుసంధానంగా అద‌న‌పు మ‌రుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. క్యూలైన్ల‌లో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్ర‌సాదం పంపిణీ, మ‌రుగుదొడ్ల‌ సౌక‌ర్యాల‌ గురించి టీటీడీ అదనపు ఈఓ ప‌రిశీలించారు. భ‌క్తుల‌తో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+