తిరుమల స్థానికులు ఓట్లు వేసేది ఆ ఎన్నికల్లోనే - పరిధి, ప్రత్యేక గుర్తింపు...!!

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ కొండ పైన గోవింద నామాలే ప్రతీ క్షణం వినిపిస్తాయి. రాజకీయాలు.. ఎన్నికలకు ఈ ప్రాంతం అతీతం. అయితే, తిరుమల కొండ పైన దాదాపు నాలుగు వేల మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఎన్నికల సందడి నెలకొంది. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి ఉండదు. అయితే, ఇక్కడి వారికి మాత్రం ఒక్క సారే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. తిరుమలను పంచాయితీగా గుర్తింపు దక్కినా.. ఎన్నికలు మాత్రం నిర్వహించరు. ఇందుకు ప్రత్యేకంగా పరిధి నోటిఫై చేసారు.

అనునిత్యం గోవింద నామాలతో ప్రతిధ్వనించే తిరుమల కొండ పైన ఎన్నికల సందడి ఎప్పుడూ కనిపించదు. కొండ పైన నాలుగు వేలకు పైగా స్థానికులు నివసిస్తున్నారు. తిరుమల పేరుకు గ్రామ పంచాయతీ అయినప్పటికీ అక్కడ పంచాయతీ ఎన్నికలు జరగవు. దేవదాయ శాఖ చట్టం కింద అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రత్యేక ప్రదేశంగా పరిగణించారు. ఈ క్రమంలో 1964లో టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న బి.నర్సింగరావును పంచాయతీ అధికారిగా నియమించారు.

తిరుమల ప్రాచీన శాసనాల డిజిటలైజేషన్: రాయల కాలం నాటి విశేషాలు వెలుగులోకి..
తిరుమల ప్రాచీన శాసనాల డిజిటలైజేషన్: రాయల కాలం నాటి విశేషాలు వెలుగులోకి..
Tirumala Why Are Panchayat Elections Not Held Despite Its Status as a Village Panchayat

దీంతో, అప్పటి నుంచే టీటీడీ ఈవోయే తిరుమల పంచాయతీ అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉంటున్న స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే భాగస్వాములవుతున్నారు.కాగా.. అక్కడ నివసించే స్థానికులకు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు మినహా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండదు. శ్రీవారు వెలసిన తిరుమల కొండను 1910 నాటి వరకు 'తిరువేంగడం' అని పిలిచేవారని పురణాలు చెబుతున్నాయి.

కాగా, తిరుమల క్షేత్రాన్ని పాలించినప్పటికీ దట్టమైన అడవిలో ఉన్న క్షేత్రం కావడంతో సాయంత్ర మైతే ఎవరూ కనిపించే వారు కాదు. దీంతో తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా భక్తుల సంఖ్య పెంచాలని అప్పట్లో పాలకులు నిర్ణయించారు. కొన్ని నివాసగృహాలను ఏర్పాటు చేసి కొంతమంది అక్కడే జీవించేలా చర్యలు తీసుకున్నారు. 1910లో మహంతు ప్రయోగ్‌దాస్‌ ఈ కార్యక్రమానికి నడుంబిగించారు. క్షేత్రానికి చుట్టుపక్కల ఉండే తమిళనాడు, చిత్తూరు వంటి ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి భూములను లీజుకు ఇచ్చారు.

వర్షాన్ని జయించిన గోవింద నామస్మరణం.. చెక్కుచెదరని భక్తిభావం
వర్షాన్ని జయించిన గోవింద నామస్మరణం.. చెక్కుచెదరని భక్తిభావం

దాంతో కొండపై నివాసం ఉండే స్థానికుల సంఖ్య పెరగడంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరిగింది. స్థానికం గా ఉన్న వారికే ఉద్యోగులుగా నియమించుకోవడంతో తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ గ్రామం ఏర్పడింది. నాలుగుమాడ వీధులు, పెరిందేవమ్మతోట, చంద్రబాబుతోట, ఆళ్వార్‌ట్యాంక్‌, పూటకూళ్లమిట్ట, మాధవనగర్‌, సూరాపురంతోట, సామేరుతోట, అల్లెమ్మతోట, సన్నిధివీధి, మెదరమిట్టి, మొండిగోపురం, సింగమాలవీధి, పుల్లారెడ్డి వీధి, గొల్లకృష్ణయ్య సందు, మూలమఠం, బొమ్మలగోపురం వంటి పేర్లతో కాలనీలు, ప్రాంతాలుగా మారాయి. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే స్థానికులకు ఓటు వేసే అవకాశం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+