Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirupati Assembly Election 2024 Results LIVE: తిరుపతిలో అప్పుడే ఆ లీడర్ కు వణుకు

తిరుపతి అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కొండ కింద ఉన్న తిరుపతిలో మామూలుగానే ఎండలు, వేడి విపరీతంగా ఉంటాయి. అలాంటిది లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడం, ఎన్నికల కౌంటింగ్ తేది దగ్గర పడటంతో ఆ ప్రాంతంలో వేడి తారాస్థాయికి చేరింది. లోకల్, నాన్ లోకల్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ మొదటి నుంచి ప్లాన్ చేసింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుక్కి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చారు.

తిరుపతిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకాలం టీటీడీలో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్న కొందరు వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసి వివాదాలకు కేంద్ర బింధువు అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అప్పుడే తిరుపతిలో వైసీపీ నాయకుల్లో అసహనం మొదలైయ్యిందని తెలిసింది.

తిరుపతి జనసేన అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులు కచ్చితంగా గెలుస్తారని కూటమి నాయకుల్లో ఆశలు మొదలైనాయి. ఇంతకాలం వైసీపీ పాలనతో విసిగిపోయిన ఉద్యోగులు తిరుపతిలో కూటమి అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులకు ఓటు వేశారని వెలుగు చూస్తోంది. తిరుపతిలో చివరి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు విజయం ఎవరిది అని చెప్పడం సాధ్యం కాదని అన్ని పార్టీల నాయకులు అంటున్నారు.

తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఆ నియోజక వర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో, టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి విజయం కోసం పావులుకదిపి ఆయన శక్తిమేరకు కొడుకును గెలిపించుకోవాలని ప్రయత్నించారు. తిరుపతి ఎమ్మెల్యే సీటు కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసిన టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టిక్కెట్ దక్కకపోవడంతో ఆమె సైలెంట్ అయిపోయారు.

AP election results Tirupati Assembly Election 2024 Results voting counting live updates news in telugu

తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జంగాలపల్లె శ్రీనివాసులు పోటీ చేశారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అయిన జంగాలపల్లె శ్రీనివాసులకు మరోసారి టిక్కెట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాకరించడంతో ఆయన వైసీపీ మీద తిరుగుబాటు చేసి తిరుపతిలో జనసేన టిక్కెట్ సంపాధించుకుని పోటీ చేశారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ తో పాటు వైసీపీ మీద జంగాలపల్లె శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తిరుపతిలో కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ రోడ్ షో నిర్వహించి నాలుగుకాళ్ల మండపం దగ్గర భారీ బహిరంగ సభ పెట్టి వైఎస్ జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ రోజున పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని కూటమి అభ్యర్థులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించడంతో అరెస్టు కూడా చేశారు.

తిరుపతి కూటమి అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులు నాన్ లోకల్ అని మొదటి నుంచి వైసీపీ నాయకులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. అయితే తాను పక్కనే ఉన్న చిత్తూరు నుంచి వచ్చానని, తనకు చిత్తూరు, తిరుపతి రెండు కళ్లులాంటివి అంటూ జంగాలపల్లె శ్రీనివాసులు శక్తి వంచనలేకుండా స్థానికులకు దగ్గర కావడానికి అనేక ప్రయత్నాలు చేసి ఓట్లు రాబట్టుకున్నారు. అయితే తిరుపతిలో జంగాలపల్లె శ్రీనివాసులకు కొందరు కూటమి అభ్యర్థులు హ్యాండ్ ఇచ్చారని తెలిసింది.

ఇక తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడ అభినయ్ రెడ్డి గెలుపు కోసం పగలు, రాత్రి అని తేడాలేకుండా కష్టపడి పని చేశారు. తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నాన్ లోకల్ అనే ఒక చిన్న విషయం పక్కనపెట్టి జంగాలపల్లె శ్రీనివాసులకు పూర్తిగా సహకరించారు. అయితే రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఆయన పరిచయాలతో ఆయన కొడుకు విజయం కోసం చక్రం తిప్పారని తిరుపతి ప్రజలు అంటున్నారు.

అయితే కూటమి విజయం గ్యారెంటీ అని టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరు గెలిచినా భారీ మెజారిటీ మాత్రం ఉండదని, తిరుపతిలో కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ ఉందని అంటున్నారు. మొత్తం మీద తిరుపతిలో చాలా గ్యాప్ తరువాత అధికారం చేతులు మారుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+