ఆర్డీఓపై చంద్రబాబు సీరియస్, గతంలో సస్పెండ్, రివర్షన్, పెద్దిరెడ్డి అండతో ?

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణం నడిబొడ్డున ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని తెలిసింది. సుమారు వారం రోజులకు పైగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు పని చెయ్యలేదని తెలిసినా అధికారులు నిద్రపోతున్నారా ? అని సీఎం చంద్రబాబు నాయుడు సంబందిత అధికారులను నిలదీశారని తెలిసింది.

సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు అమర్చిన కాంట్రాక్టర్ ఎవరు ?, సీసీటీవీ కెమెరాలు పని చెయ్యడం లేదని వారికి ఏమైనా సమాచారం ఇచ్చారా ? లేదా అని తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీసీటీవీలు పని చెయ్యడం లేదని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా అని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఫోన్ లో నిలదీశారని తెలిసింది.

Tirupati collector office RDO Murali what is the work of madanapalle sub collector office

సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీసీటీవీలు పని చెయ్యడం లేదని సమాచారం తెలుసుకున్న పోలీసులు అదే కార్యాలయానికి ఎదురుగా ఉన్న సాయిబాబా గుడి రోడ్డులోని ఇళ్లకు, సమీపంలోని ఎస్ బీఐ ఏటీఎం మిషన్ దగ్గర, కాంతరాజు ఆసుపత్రి దగ్గర, మిషన్ కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే పోలీసులు సేకరించిన సమాచారంతో పలువురు అనుమానితులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది.

ఇక పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీఓ మురళికి పోలీసు అధికారులు పలు ప్రశ్నలు వేస్తున్నారని తెలిసింది. గతంలో ఒంగోలులో పని చేసే సమయంలో ఆర్డీఓ మురళి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత మదనపల్లె ఆర్డీఓగా బాద్యతలు స్వీకరించిన తరువాత మురళి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత మదనపల్లెలో పని చేసే సమయంలోనే ఆర్డీఓ మురళి పెద్దిరెడ్డి చెప్పినట్లు అంతా చేశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి.

తరువాత మదనపల్లె ఆర్డీఓగా పని చేస్తున్న సమయంలోనే మురళిని సస్పెండ్ చేశారు. తరువాత ఆర్డీఓగా ఉన్న మురళిని తహసిల్దారుగా రివర్షన్ ఇచ్చారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జోక్యం చేసుకుని మురళిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన రివర్షన్ కూడా ఉపసంహరించుకోవడంతో మురళి ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి ఆర్డీఓ మురళి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Tirupati collector office RDO Murali what is the work of madanapalle sub collector office

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు మురళి మదనపల్లె ఆర్డీఓగా అదే సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. తరువాత పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మురళిని తిరుపతికి బదిలి చేశారు. ప్రస్తుతం తిరపతి కలెక్టర్ ఆపీసులో మురళి విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఆర్డీఓ మురళి మదనపల్లె వచ్చారు. తరువాత మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్ తో చర్చించారని తెలిసింది.

సెలవు రోజు ఆర్డీఓ మురళి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు ?, ఆయనకు అక్కడ ఏం పని అని పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో మదనపల్లె ఆర్డీఓగా పని చేసే సమయంలోనే మురళి పుంగనూరు నియోజక వర్గంలోని 900 ఎకరాల వివాదాస్పద భూములను పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుల పేరిట రికార్డులు తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీఓలు హరిప్రసాద్, మురళిని విచారణ చేసి మరన్ని వివరాలు సేకరించడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+