చట్టం నుంచి తప్పించుకున్నాశ్రీవెంకటేశ్వరస్వామి నుంచి తప్పించుకోలేరు
టీటీడీ విషయంలో తప్పు చేసిన వాళ్లు, టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం జరగడానికి కారణం అయిన వాళ్లు సాంకేతిక కారణాలతో చట్టం నుంచి, న్యాయస్థానం నుంచి తప్పించుకున్నా శ్రీవేంకటేశ్వర స్వామి వేసే శిక్ష నుంచి ఏమాత్రం తప్పించుకోలేరని తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లె శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనా ప్థలాన్ని కూటమి నేతలతో కలసి తాను పరిశీలించానని తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. ఏడీ బిల్డింగ్ ను తాను పరిశీలించానని ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు. ఇంజనీరింగ్ విభాగం గది లోపలకు వెళితే ఆధారాలు చెరిగిపోతాయని పోలీసులు, విజిలెన్స్ అధికారులు తనకు చెప్పారని, సాక్షాలు చెదిరిపోకూడదని తాను ఆ గది లోపలికి వెళ్లలేదని జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు.

ఘటన మొత్తాన్ని వీడియో ద్వారా తనకు అధికారులు వివరించారని ఎమ్మెల్యే శ్రీనివాసులు వివరించారు. శ్రీవారి పాలనా నిర్వహణకు తిరుపతిలోని టీటీడీ కార్యాలయం గుండెకాయ వంటిది అని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమని, ఇంజనీరింగ్ విభాగంలోని బైపాస్ రోడ్లను పర్యవేక్షించే డీఈకి సంబంధించిన ఫైళ్లు మాత్రమే దగ్ధం కావడం పలు సందేహాలకు తావిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు.

వైసీపీ గత ఐదేళ్ల పాలనలో టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి పలువురికి ఇటీవల విజిలెన్స్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, నిజానిజాలు బయట పడతాయని, శ్రీవెంకటేశ్వరస్వామి శిక్ష నుంచి నిందితులు తప్పించుకోలేరని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు తెలిపారు.












Click it and Unblock the Notifications