తిరుపతి లడ్డూ వివాదం.. జగన్ పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు!

తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు ఉపయోగించారన్న విషయం తాజాగా వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అత్యంత పవిత్రంగా భావించే స్వామివారి లడ్డు అపవిత్రమైందని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పైన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చెప్పడం దీనికి సంబంధించి లాబ్ రిపోర్టులు కూడా వెలుగులోకి రావడంతో ఇది హిందువులను హిందూ ధర్మాన్ని కించపరచటమేనని వైయస్ జగన్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పైన కేంద్ర హోం శాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.

Tirupati laddus row complaint to union home ministry over ys jagan demands to take serious action

హిందువుల ఆత్మను హత్య చేశారని జగన్ పై ఆగ్రహం
వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడుతూ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయ పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారని, ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని జగన్ మోహన్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని జగన్ మోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖకు చేసిన ఫిర్యాదులో వినీత్ జిందాల్ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ తో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్, డిజిపి లకు కూడా ఈ వ్యవహారం పైన న్యాయవాది ఫిర్యాదు చేశారు.

ఈ సెక్షన్ల క్రింద కేసులు పెట్టాలని డిమాండ్
గత సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. అంతే కాదు జగన్ తో పాటుగా ఇందుకు కారకులైన వారిపైన భారత న్యాయ సంహిత లోని సెక్షన్ 152 ,192,196,298, 353 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది వినీత్ జిందాల్ డిమాండ్ చేశారు

జగన్ పై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
జాతీయ భద్రతా చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం హిందువులకు ఆగ్రహం తెప్పిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+