Nara Lokesh : లోకేష్ కు తిరుపతి పోలీసుల నోటీసులు..! పాదయాత్రకు నో పర్మిషన్ !
ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు తిరుపతి పోలీసులు ఇవాళ నోటీసులు ఇచ్చారు.
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రతో తిరుపతికి చేరుకున్న లోకేష్.. ఇవాళ విద్యార్దులతో భేటీ కావాల్సి ఉంది. విద్యార్దుల సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ సిద్ధమైన తరుణంలో స్ధానిక పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.
తిరుపతిలో యువగళం పాదయాత్రకు లోకేష్ ఇప్పటికే పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే నారా లోకేశ్‍కు అలిపిరి పోలీసులు ఇవాళ నోటీసులు ఇచ్చారు.అంకుర ఆస్పత్రి రోడ్డులోని వసతి కేంద్రం వద్ద లోకేష్ కు పోలీసులు నోటీసులు అందించారు. లోకేష్ ఇవాళ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పాదయాత్రకు మాత్రమే అనుమతి ఉందన్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

తిరుపతిలో నారా లోకేష్ పాదయాత్రలో నోటీసుల పర్వం కలకలం రేపింది. తిరుపతి నగర వీధుల్లోనూ పాదయాత్రకు అనుమతి లేదని లోకేష్ కు పోలీసులు తేల్చిచెప్పేశారు. పది రోజుల క్రితమే టీడీపీ నేతలు అడ్మిన్ ఎస్పీని కలిసి రూట్ మ్యాప్ అందించారు. అయితే చివరి నిమిషంలో వైసీపీ నేతల ఒత్తిడితోనే పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నగరవీధుల్లోనే పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ నేతలు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications