Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతి- షిర్డీకి ఇకపై ప్రతిరోజూ రైలు సర్వీసు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

తిరుపతి- షిర్డీ మధ్య ఇకపై ప్రతిరోజూ రైలు నడవనుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి- షిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలును ఇకపై ప్రతి రోజూ నడపనున్నట్లు వెల్లడించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా ఈ రైలు షిర్డీ చేరుకోనుంది. తిరుపతి టూ షిర్డీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తాజాగా ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.


కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతిరోజూ తిరుపతి- షిర్డీ మధ్య రైలు నడవనుంది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి- షిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలు ఇకపై ప్రతి రోజూ నడపనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. తిరుపతి టూ షిర్డీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.

Tirupati-Shirdi Daily Train Approved CM Naidu s Proposal Gets Central Nod

త్వరలో బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇటీవల ఆ రైళ్లను నవంబర్ వరకు పొడిగించింది. వాటిలో తిరుపతి- షిర్డీ, నరసాపురం-తిరువణ్ణామలై మధ్య నడిచే రైళ్లతో పాటు, హైదరాబాద్-కొల్లాం, కాచిగూడ-మధురై మార్గాల్లోని స్పెషల్ ట్రైన్స్ కూడా తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఇక ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+