తిరుపతి - తిరువనంతపురం దక్షిణ దర్శన్ యాత్ర.. IRCTC భారత్ గౌరవ్ రైలు సూపర్ ప్యాకేజీ

irctc టూరిజం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి తిరువనంతపురం వరకు రామేశ్వరం- తిరుపతి దక్షిణ దర్శన్ యాత్ర పేరుతో కొత్త భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్యాకేజీని ప్రారంభించింది. ఈ యాత్ర దక్షిణ భారతదేశంలోని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ సాగుతుంది. ఇందులో 9రాత్రులు, 10పగళ్ళు టూరిస్టులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇక ఈ ప్యాకేజీ నవంబర్ 7వ తేదీన ప్రారంభమై నవంబర్ 16వ తేదీన ముగుస్తుంది.

తిరుపతి నుండి దక్షిణ దర్శన్ యాత్ర
రామేశ్వరం- మధురై - తిరుపతి దక్షిణ దర్శన్ యాత్ర పేరుతో ఇచ్చే ఈ ప్యాకేజ్ దక్షిణభారత రాష్ట్రాలలోని ఐదు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కలుపుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం లను కలుపుతూ ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా మొదట ఇక్కడ యాత్రికులు తిరుపతి నుండి తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

Tirupati - Thiruvananthapuram Dakshina Darshan Yatra IRCTC new Bharat Gaurav train coming soon

రామేశ్వరం, మధురైల మీదుగా కన్యాకుమారి
ఇక్కడ యాత్రికులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, పద్మావతి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత రైలు రామేశ్వరానికి చేరుకుంటుంది. ఇది భారతదేశంలోని చార్ ధామ్ లలో ఒకటి. ఇక్కడ రామనాథ స్వామి ఆలయం, ధనుష్కోడి ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఈ యాత్ర మధురై లోని మీనాక్షి అమ్మన్ ఆలయానికి చేరుకుంటుంది. ద్రవిడ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత అక్కడనుండి రైలు కన్యాకుమారికి బయలుదేరుతుంది.

తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయానికి
కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపాన్ని, కన్యాకుమారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి రైలు చేరుకుంటుంది. ఇక్కడ కేరళ రాజధాని తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కోవలం బీచ్లో ప్రయాణికులు ఎంజాయ్ చేస్తారు. దీంతో irctc దక్షిణ దర్శన యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజ్ ధరలు ఇలా
irctc ఈ యాత్రలో ప్రయాణికులకు దేవాలయ సందర్శన తో పాటు, స్థానిక ప్రయాణం, విశ్రాంతి సమయం మొదలైన అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ యాత్రలో వెళ్లాలనుకునేవారు స్లీపర్ క్లాస్ అయితే రూ.18040, థర్డ్ ఏసి అయితే రూ.30 వేల 370, సెకండ్ ఏసి అయితే రూ.40,240 గా ఉంది.

అన్ని వసతులు, రవాణా, భోజనం ఖర్చు irctc దే
5సంవత్సరాల నుండి 11సంవత్సరాల వరకు పిల్లలకు స్లీపర్ క్లాస్ 16,890రూపాయలు, థర్డ్ ఏసి 29,010 రూపాయలు, సెకండ్ ఏసీ 38 వేల 610 రూపాయలుగా ఉంది. ఈ ప్యాకేజీలో రైలు చార్జీలతో పాటు, భోజనం, హోటల్ వసతి, స్థానిక రవాణా, సందర్శన స్థలాలు ఇలా అన్ని irctc ని కల్పిస్తుంది. ప్రయాణికుల బడ్జెట్ కు తగ్గట్టు హోటల్స్ లో వసతి కల్పిస్తారు. ఇందులో ఏసి, నాన్ ఏసీ ఉంటాయి.

అతి తక్కువ ఖర్చుతో దక్షిణ దర్శన్ యాత్ర.. బుక్ చేసుకోండి
ఇక ప్రతి చోట సందర్శన స్థలాలకు బస్సులను ఉపయోగిస్తారు. ప్రయాణంలో స్వచ్ఛమైన శాఖాహారాన్ని పెడతారు. ప్రతి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. irctc టూరిజం వెబ్సైట్ లేదా నిర్దేశించబడిన ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ఈ యాత్రకు బుకింగ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ఖర్చుతో ఇబ్బంది లేని మౌలిక వసతులతో తిరుపతి నుండి తిరువనంతపురం వరకు ఆధ్యాత్మిక ప్రయాణం కోసం బుక్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+