జయలలిత నమ్మిన ఐఏఎస్ ఇంట్లో‘44 కేజీల బంగారం’సీజ్ !
అమరావతి: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు బండారం అంతా బయటపడుతున్నది. చెన్నైలోని అన్నా నగర్ లో ఉన్నఆయన ఇంటిలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం సీఆర్ఎఫ్ బలగాలను చెన్నైలోని రామ్మోహన్ రావు ఇంటి దగ్గర మొహరించింది. తమిళనాడు సీఎస్ కు చెందిన బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో రామ్మోహన్ రావు బంధువు ఇంటిలో సోదాలు చేసిన ఐటీ అధికారులు 40 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు ఉన్న రామ్మోహన్ రావ్ ఇంటిలో రూ. 26 లక్షల (నగదు), 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఒక ఐఏఎస్ అధికారి అయిన రామ్మెహన్ రావుకు 44 కేజీల బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు ఇచ్చారు ? అని ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రామ్మోహన్ రావుకు సహకరిస్తున్న అధికారులు సైతం హడలిపోతున్నారు.
రామ్మోహన్ రావుకు సన్నిహితులు, బంధువులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంకా ఏమేమి చెప్పాడు దేవుడా ? అంటూ అన్నాడీఎంకే నాయకులు హడలిపోతున్నారు. తిరుపతిలో ఉన్న రామ్మోహన్ రెడ్డి సన్నిహితుల గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది.
IT seized 26lakhs and 4kg gold from RamaMohana Rao's Chittoor residence ; 40kg gold seized from Rao's relative residence at Vijayawada #Raid
— Manoj SavarimuthuRaj (@manojprabakar4) 21 December 2016
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications