RGV:రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
RGV:వర్మ ఈ తరహా వ్యాఖ్యలు చేసే సమయంలో యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు కూడా
RGV: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన 'అకడమిక్ ఎగ్జిబిషన్ 2023' కార్యక్రమానికి వర్మ ముఖ్య అతిథిగా హాజరైన హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులంతా తన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని, నచ్చింది తినాలని, కావల్సినంత తాగి ఇష్టం వచ్చినప్పుడు శృంగారం చేయాలంటూ బోధించాడు. వర్మ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అక్కడే ఉన్న ప్రొఫెసర్లను కూడా బాగా ఇబ్బందులకు గురిచేసింది.
తాను తనకోసమే బతుకుతానని, తాను చచ్చిపోయిన మరుక్షణం ఈ ప్రపంచం ఏమైనా తనకు అవసరంలేదన్నాడు. తనకు పైన స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశిలపై తనకు నమ్మకం లేదని, అందుకే తాను అన్నీ ఇక్కడే వెతుక్కుంటానని చెప్పుకొచ్చారు. తనను యూనివర్సిటీ వీసీ పిలాసఫర్ అనడంపై స్పందిస్తూ నేను పిచ్చినా కొడుకును అంటూ వ్యాఖ్యానించారు.

తాజాగా దీనిపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టి.. వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ రాజశేఖర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు తప్పుడు సంకేతాలనిస్తున్న వర్మను అరెస్ట్ చేయాలన్నారు.
పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని టీఎన్ఎస్ ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆర్జీవీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications