వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ మద్దతు దక్కేదెవరికి : అటు సీఎం జగన్ -ఇటు పవన్..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని ఏపీ పర్యటన ఇప్పుడు రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది. సీఎం జగన్ - జనసేనాని పవన్ లో ఎవరికి ప్రధాని అండగా నిలవబోతున్నారనేది క్లారిటీ రానుంది. అధికారిక పర్యటన కావటంతో ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బీజేపీ పార్టీ పరంగా రోడ్ షోకు సిద్దమైంది. బహిరంగ సభకు వైసీపీ భారీగా జనసమీకరణ చేస్తోంది. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సమయం నుంచి ప్రధాని మోదీతో సీఎం జగన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

To whom will Modi support, will it be Jagan or Pawan Kalyan-Interesting twists now in AP politics

ఏపీపై ప్రధాని వ్యూహం ఏంటి
కేంద్రంలో అనేక సందర్భాల్లో వైసీపీ కీలక అంశాల విషయంలో పార్లమెంట్ లో మద్దతుగా నిలిచింది. ప్రధాని మోదీ - అమిత్ షా ఏపీ సీఎం జగన్ తో సన్నిహితంగా ఉండటం పైన పలు సందర్భాల్లో పవన్ సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక దశలో ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అనే వ్యాఖ్యలు వచ్చాయి. ఈ సమయంలో..ఏపీలో వచ్చే ఎన్నికలకు వైసీపీ వర్సస్ ప్రతిపక్షాలు కసరత్తు ప్రారంభించిన వేళ..ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఆసక్తిగా మారింది. ఈ పర్యటనలో ప్రధానితో జనసేన అధినేత పవన్ భేటీ కానున్నారు. ఆ సమయంలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ తీరు పైనే ఆయన ఫిర్యాదు చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో కలిసి పని చేయటానికి తాను సిద్దంగా ఉన్నానని చెబుతూనే..స్థానికంగా బీజేపీ నేతలు కొందరు వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలవటం పైన పవన్ ప్రస్తావించే అవకాశం ఉంది.

To whom will Modi support, will it be Jagan or Pawan Kalyan-Interesting twists now in AP politics

జగన్ కే మద్దతా.. వైఖరి మారుతుందా
అయితే, టీడీపీతో కూడా కలిసి వెళ్దామని పవన్ ప్రతిపాదన చేస్తారనే ప్రచారం సాగుతున్నా..టీడీపీ తరపు ప్రధాని వద్ద పవన్ ప్రస్తావించే అవకాశం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు దత్తపుత్రుడుగా పవన్ కల్యాణ్ పైన వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ విశాఖలో ప్రధాని పర్యటన మొత్తం వెంటే ఉండనున్నారు. సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలికిన తరువాత ఆయనతో ఈ రాత్రి లేదా శనివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఏపీకి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాలను చర్చించనున్నారు. 2019 ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలు..జాతీయ స్థాయిలో ప్రధాని మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ తో చేతులు కలపటం..అమిత్ షా తిరుమల పర్యటన సమయంలో ఆయన వాహనం పైన దాడి వంటి అంశాలను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు.

To whom will Modi support, will it be Jagan or Pawan Kalyan-Interesting twists now in AP politics

పవన్ కల్యాణ్ తిరిగి దగ్గరవుతారా
ఇప్పటికీ పార్టీ నేతలు ఆ అంశాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో, టీడీపీ తమ పొత్తు ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, ప్రధాని మోదీ- అమిత్ షా నిర్ణయం ఫైనల్ కావటంతో..ఎలాగైనా జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న పవన్ తిరిగి ఏపీలో 2014 పొత్తులను కోరుకుంటున్నారు. చంద్రబాబు అదే వ్యూహంతో ఉన్నా..ప్రస్తుతం పవన్ చొరవ తీసుకొని ఆ దిశగా తొలి అడుగుకు విశాఖ వేదిక కానుంది. ఈ భేటీ ద్వారా ఇప్పటి వరకు ఉన్న గ్యాప్ భర్తీ చేసుకొని..రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిగేలా పవన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో..సీఎం జగన్ జరుగుతున్న పరిణామాలను పూర్తిగా గమనిస్తున్నారు. ప్రధాని మోదీ తన రాజకీయ ప్రత్యర్ధులతో వ్యవహరించే తీరు ఆధారంగా సీఎం జగన్ తన కార్యాచరణ డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ప్రధాని విశాఖ టూర్ ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదికగా మారుతోంది.

English summary
Ahead of PM Modi Vizag two days tour interesting political equations is on screen. Pawan Kalyan meeting with PM modi became key trun in AP Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X