దర్శకుడు రాజమౌళి ఇంట తీవ్ర విషాదం
దిగ్గజ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీరవాణి తల్లి ఈరోజు మృతిచెందారు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడుతోంది. దీంతో ఆమెకు ఇంటివద్దనే చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించి మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజమౌళి, కీరవాణి అన్నదమ్ముల పిల్లలన్న విషయం తెల్సిందే.
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అన్నదమ్ములు. అందరూ ఉమ్మడి కుటుంబంలోనే పెరిగారు. రాజమౌళికి పెద్దమ్మ అంటే ఎంతో ఇష్టం కావడంతో ఆమె మృతదేహాన్ని రాజమౌళి ఇంటికి తరలించారు. రాజమౌళి ప్రతి సినిమాకు కీరవాణినే సంగీతం అందిస్తారు. అన్నదమ్ములు ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో నిలిచింది. రాజమౌళి పెద్దమ్మ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ తో పాటు, లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్ రన్నరప్ పురస్కారాలు రాజమౌళి అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ అవార్డులు వరించాయి. లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి అవార్డ్ గెలుచుకున్నారు. తాను ఇంత పేరు తెచ్చుకుంటానని నాకంటే ముందు ప్రభాస్ నమ్మాడని పలు సందర్భాల్లో రాజమౌళి చెబుతుంటారు.












Click it and Unblock the Notifications