మిస్ యూ: ఎన్టీఆర్.. వైఎస్సార్‌లపై నటి పూనమ్ కౌర్ సంచలనం: పవన్ కల్యాణ్ ప్రస్తావన లేకుండా

అమరావతి: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఉద్దేశించి కామెంట్స్ పెట్టారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పెద్ద అభిమానిగా టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న పూనమ్ కౌర్.. ఆ ఇద్దరు దివంగత నేతలను ఉద్దేశించి.. తాజాగా చేసిన ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఆయన ప్రస్తావన లేకుండా ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానవత్వం మూర్తీభవించిన నాయకులని ఆమె పేర్కొన్నారు. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల పాగా ధరించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఫార్మర్స్ మిస్ యూ అని కామెంట్స్ చేశారు. లవ్ ఎమోజీలను వాటికి జత చేశారు. అలాగే- తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే తనకు గౌరవభావం ఉందని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, కేప్టెన్ అమరీందర్ సింగ్ పేర్లను తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

Tollywood actress Poonam Kaur tweets on NT Rama Rao and YS Raja Sekhar Reddy

రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కారణాలు, ఉద్దేశాలను పక్కన పెట్టాలని వేడుకొన్నారు. సుదీర్ఘకాలం పాటు రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలకు పరిష్కారాన్ని చూపాలని కోరారు. పూనమ్ కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్. ఆమె హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ప్రస్తుతం దేశ రాజధానిని ముట్టడించిన రైతులు ఎక్కువ శాతం మంది ఆమె మాతృ రాష్ట్రానికే చెందిన వారు కావడాన్ని దృష్టిలో ఉంచుకుని పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+