Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్‌తో రాజమౌళి భేటీ: సడన్‌గా నిర్మాతతో సహా: పేర్ని, కొడాలి నాని సమక్షంలో..!

అమరావతి: పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ ఇంకొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 25వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మల్టీ స్టారర్ సినిమా ఇది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ పీరియాడికల్ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

 తెర దించిన నేపథ్యంలో..

తెర దించిన నేపథ్యంలో..


సంక్రాంతి పండగకే ఇది విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందడం, ఏపీలో సినిమా టికెట్ల వివాదం వంటి కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం ఈ రెండు సమస్యలు లేవు. వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా టికెట్ల వివాదానికీ ఏపీ ప్రభుత్వం తెర దించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దల కోరిక మేరకు సినిమా టికెట్ల రేట్లను సవరించింది. ఇదివరకటి కంటే రేట్లను పెంచింది. కొద్దిరోజుల కిందటే ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. జీవో వెలువడింది.

రాజమౌళి, దానయ్య భేటీ..

రాజమౌళి, దానయ్య భేటీ..

ఈ పరిణామాల మధ్య దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఆయన వెంట ట్రిపుల్ ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడిన తరువాత క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వైఎస్ జగన్‌తో వారు సమావేశం అయ్యారు.

జూనియర్ తరఫున..

జూనియర్ తరఫున..

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇందులో పాల్గొన్నారు. సినిమా టికెట్ల రేట్లను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని ఒకరిద్దరు ప్రతినిధులు దీనికి హాజరైనట్లు తెలుస్తోంది. మంత్రి కొడాలి నాని- నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ప్రత్యేకించి- ట్రిపుల్ ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. అందుకే జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి మేరకు కొడాలి నాని ఈ భేటీలో పాల్గొన్నారు.

జగన్‌ను కలుసుకోవడం ఇది రెండోసారి..

జగన్‌ను కలుసుకోవడం ఇది రెండోసారి..


ఈ మధ్యకాలంలో ఎస్ఎస్ రాజమౌళి.. వైఎస్ జగన్‌ను కలుసుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు సినిమా టికెట్ల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ముఖ్యమంత్రిని కలిసిన టాలీవుడ్ ప్రతినిధుల బృందంలో రాజమౌళి ఉన్నారు. ఆ బృందంలో డీవీవీ దానయ్య లేరు. సినిమా టికెట్ల రేట్లను పెంచినందుకు రాజమౌళి, దానయ్య- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తమ విజ్ఞప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Recommended Video

    Radhe Shyam: Prabhas మూవీతో AP Ticket Prices ధరల పెంపు మొదలు |RRR | Oneindia Telugu
    బెనిఫిట్ షోతో పాటు..

    బెనిఫిట్ షోతో పాటు..

    ట్రిపుల్ ఆర్ సినిమా బడ్జెట్ గురించి వైఎస్ జగన్‌కు వివరించారని, ఈ సినిమాకు కొంత ప్రత్యేకమైన వెసలుబాటును కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. ఏపీలో రోజూ అయిదు ఆటలను ప్రదర్శించడానికి అనుమతి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ, బీ, సీ సెంటర్లల్లో కూడా ట్రిపుల్ ఆర్ బెనిఫిట్‌ షోను ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని రాజమౌళి, దానయ్య వైఎస్ జగన్‌ను కోరినట్లు చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+