ఉరేసుకొని హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్, భార్యకు మెసేజ్!

Uday Kiran
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందారు. ఆయన నటించిన తొలి సినిమా 'చిత్రం'. దీనిని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పైన ప్రముఖ దర్శకులు తేజ తెరకెక్కించారు.

'నువ్వు నేను' సినిమాలో ఉత్తమ నటనకు గాను 2001లో ఫిలింఫేర్ అవార్డు పొందారు. నువ్వు నేను, మనసంతానువ్వే, శ్రీరామ్ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ తమిళంలో కూడా నటించాడు. మొత్తం 19 సినిమాలలో నటించాడు. తెలుగులో 16, తమిళంలో 3 సినిమాల్లో నటించారు.

1980 జూన్ 26న జన్మించిన ఉదయ్ సికింద్రాబాదులోని వెస్లీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో మోడలింగ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ 2012 అక్టోబర్ 24న విషితను పెళ్లి చేసుకున్నారు. చనిపోయే ముందు ఉదయ్ భార్యకు ఐ లవ్యూ అని మెసేజ్ పెట్టారట.

ఉదయ్ కిరణ్ ఇంటికి క్లూస్ టీం చేరుకుంది. ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరిసారిగా ఓ మిత్రుడితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. భూపాల్ ద్వారా తమకు సమాచారం అందిందని హీరో శ్రీకాంత్ అన్నారు. తాము వెళ్లేసరికి మృతి చెందాడన్నారు. ఉదయ్ తండ్రి అందుబాటులో ఉన్నారని, మామ, భార్య ఆసుపత్రికి వచ్చారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+